
సీఎం జగన్‌పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రశంసలు కురిపించారు. శనివారం తలసాని దుర్గమ్మను దర్శించుకున్నారు. దుర్గగుడి అభివృద్ధికి జగన్ 70 కోట్లు ఇవ్వడం మంచి పరిణామమని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. యాదగిరిగుట్ట మరో తిరుపతి కావాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. బీజేపీవి టెంపరరీ పాలిటిక్స్ దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉండదని కొట్టిపారేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన నేత మాటలు చెల్లవన్నారు.