ఒకప్పుడు దాహం వేస్తే ఆకాశం వైపు.. ఆకలిస్తే భూమి వైపు చూసే వారు రైతన్నలు.. కానీ ఇప్పుడు రైతు ప్రభుత్వాలు వచ్చాయి. రైతులకు పెద్దపీట వేస్తున్నాయి. రైతులే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. రైతుకు కోపం వస్తే ఢిల్లీ గద్దె కదులుతోంది. అలాంటి రైతు రాజ్యంలో వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే పుట్టుకొచ్చింది మా ‘ఏరువాక’ మాసపత్రిక. ఒక రైతు విత్తు విత్తే నుంచి పంట చేతికొచ్చే దాకా సాగులో వినూత్న పద్ధతులు, పోకడలు, ఆధునిక వ్యవసాయం, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు సమస్త రైతు నేస్తంలా మా పత్రిక ఆవిష్కృతమైంది.
తాజాగా కాకినాడలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కన్నబాబు చేతుల మీదుగా ‘ఏరువాక’ మాసపత్రిక విడుదలైంది. రైతుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం మంచి ప్రయత్నం చేస్తోందని.. అవన్నీ మీ పత్రిక ద్వారా ప్రజల చేరేవేసేందుకు కృషి చేయాలని ఆశిస్తున్నామని కన్నబాబు అన్నారు. ఈ సందర్భంగా పత్రిక యాజమాన్యాన్ని రైతు బిడ్డగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా పత్రికను ఆవిష్కరించిన మంత్రి కన్నబాబుకు ‘ఏరువాక’ సంపాదకులు రాఘవరావు కృతజ్ఞతలు తెలిపారు.
ఒక రైతు బిడ్డగా, ఊహా తెలిసినప్పటినుండి పొలంలో అమ్మ నాన్న లతో కలసి వ్యవసాయం చేసిన ఒక రైతు గా ‘రాఘవరావు’ అనే నేను జీవన ప్రయాణం మొదలుపెట్టాను. నా జీవన ప్రయాణంలో కొన్ని రోజులు వ్యవసాయానికి దూరం గా నా వ్యాపారంలో లీనమైన కూడాను మా నాన్న వాల్ల ఏరోజు వ్యవసాయం నానుండి దూరం కాలేదు. ఒక రైతు పంట వేయటం మొదలుపెట్టిన నాటి నుండి పంట చేతికి వచ్చేవరకు ఎన్నో అడ్డంకులను, కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్తితులు వున్నయి. అది ప్రక్రుతి వైపరీత్యాలు వల్ల కాని, సరియిన నీటిపారుదల వ్యవస్థ లేకగాని, లేదా వ్యవసాయానికి అయ్యే ఖర్చులు అధికం అవటం వల్ల కావచ్చు. ప్రభుత్వాలు తమవంతు భాద్యతగా రైతులకోసం రూపొందించే రైతులకు ఉపయోగపడే ఎన్నో పధకాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు శాస్త్రజ్ఞులు ఆవిష్కరిస్తున్న కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి తెస్తున్నప్పటికి, అవి రైతు కి చేరే వ్యవస్థలో వున్న లోపాల వల్ల లేదా సరయిన సమగ్ర సమాచార వ్యవస్థ లేకపోవటం వల్ల అవి సరిగా ఉపయోగపడటం లేదు. ఇటువంటి పరిస్థితిని రూపుమాపటానికి ఒక చిరు ప్రయత్నం గా మీము మీముందుకు మా “ఏరువాక” మాస పత్రికను తెస్తున్నాము.
మా మాసపత్రిక ప్రభుత్వ పధకాల వివరాలను, శాస్త్రజ్ఞులు ఆవిష్కరించే నూతన ఆవిష్కరణలను రైతులకు ఎప్పటికప్పుడు అందజేస్తూ రైతులు వ్యవసాయానికి ఆధునికతను జోడించి వారి కష్టాలను అధిగమించి ఫలప్రదమైన రాబడిని సాధించే విధంగా తద్వారా ప్రపంచ ఆహార అవసరాలకు తగిన ఉత్పత్తిని పెంచే బృహత్కార్యానికి కృషిచేస్తుందని తెలియజేస్తున్నాము. వ్యవసాయ, మరియు వ్యవసాయ అనుబంధ రంగా శాస్త్రవేత్తకు, ఆచార్యుకు, క్షేత్రస్ధాయిలో రైతు వెన్నంటి ఉండి ఆహారభద్రతకు అహర్నిశం కృషిచేస్తున్న అధికారులకు ఏరువాక మాస పత్రిక నమస్కారము.
Also Read: జగన్.. మరో చారిత్రక నిర్ణయం
పెరుగుతున్న ప్రపంచ జనాభాకు ఆహారభద్రత సమకూర్చవసిన గురుతర బాధ్యతగా మీరందరూ చేస్తున్న కృషి చాలా మివైనది. పొలానన్ని… హలా దున్ని… ఆరుగాం కష్టించి పనిచేసి శ్రమైక జీవన సౌందర్యంతో సమాజానికి పట్టెడన్నం పెడుతున్న రైతన్నకు తోడుగా మీరు నిబడి, మరో సస్యవిప్లవం వైపు పయనిస్తున్న నేపధ్యమిది. మీకు తోడుగా మీ విజ్ఞాన సంపదను ప్రతి గ్రామీణ రైతుకు, అలానే రైతు కావాలి అని కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తికీ చేరే విధంగా అందించే ఒక చిరు ప్రయత్నంగా ఈ ఏరువాక మాస పత్రిక మీముందుకు వస్తుంది.
Also Read: అచ్చెన్నాయుడు, రామానాయుడుకు నోటీసులు
అనుభవజ్ఞులైన పాత్రికేయులు, డిజిటల్ రంగంలో నిపుణులైన యువ సాంకేతిక నిపుణు సారధ్యంలో ఏరువాక వెబ్ సైట్ మరియు యుట్యుబ్ ఛానల్‌తో డిజిటల్ మరియు ప్రసార రంగంలో కూడా డిసెంబర్ 23వ తేదీన జాతీయ రైతుదినోత్సవం సందర్భంగా వెలువరించాము.. రైతులకు వెన్నుదన్నుగా నిలబడేలా ఈ ‘ఏరువాక’ మాసపత్రిక తోడ్పాటును అందిస్తుంది. రైతులకు మేలుకొలుపుగా ఉంటుందని ఈ మాసపత్రిక ఎడిటర్ రాఘవరావు ఈ సందర్భంగా తెలిపారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Minister kannababu launches eruvaka monthly magazine
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com