Sashtanga Namaskar: సాధారణంగా మనం ఆలయాలకు వెళ్లినప్పుడు భక్తులు తమ భక్తిని వివిధ రూపాలలో తెలియజేస్తుంటారు. కొందరు స్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దేవుడిని నమస్కరించగా మరికొందరు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆ దేవుడిని నమస్కరిస్తారు. అయితే పురుషులు మాత్రమే దేవుడికి సాష్టాంగ నమస్కారం చేయాలని స్త్రీలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. స్త్రీలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చేయకూడదనే విషయానికి వస్తే…
Also Read: ఉక్రెయిన్ లో భారతీయ విద్యార్థినీలను ఎత్తుకెళుతున్న రష్యా సైనికులు?
సాష్టాంగ నమస్కారం అంటే మన శరీరంలో 8 భాగాలు నేలను తాకుతూ దేవుడికి నమస్కారం చేయడం అని అర్థం. పురుషులు ఇలా సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. అదే స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేసే సమయంలో స్త్రీల ఉదరం నేలను తాకుతుంది. అంటే స్త్రీల ఉదరంలో గర్భాశయం ఉంటుంది. ఇలా స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు గర్భాశయం నేలను తాకకూడదు ఎందుకంటే ఆ గర్భాశయంలో ద్వారా మహిళ మరొకరికి జన్మనిస్తుంది అలాగే ఆ భగవంతుడు కూడా అదే గర్భాశయం నుంచి పుట్టాడు కనుక అంతటి పవిత్రమైన గర్భాశయం నేలను తాగకూడదని అందుకే స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని చెబుతారు.
ఆధ్యాత్మిక పరంగా ఇలా గర్భాశయం నేలను తాకకూడదని పండితులు చెబుతున్నారు. అయితే గర్భాశయం ఎంతో సున్నితమైన భాగం కనుక స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ఏదైనా సమస్యలు తలెత్తితే భవిష్యత్తులో వారికి పిల్లలు జన్మించాలన్న లేదా మరేదైనా సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదని చెబుతారు.అందుకే స్త్రీలు ఎల్లప్పుడు మోకాళ్ళపై కూర్చుని భగవంతుడికి నమస్కారం చేయాలని పండితులు తెలియజేస్తున్నారు.
Also Read: వివేకా హత్య కేసులో ఇక వేగం పెరగనుందా?
Recommended Video: