Singer Revanth: ‘మనో హరీ’ బాహుబలి సినిమాలోని రోమాంటిక్ పాటను లయ బద్దంగా పాడి శ్రోతల మనసు దోచుకున్నాడు సింగర్ రేవంత్. అతడి పాటలు తెలుగు నాట చాలా పాపులర్. సినిమాలు, ప్రమోషన్ పాటలే కాదు.. ‘సరిగమప’ లాంటి షోల్లోనూ సింగర్ రేవంత్ పాల్గొంటూ పాడుతూ అలరిస్తున్నాడు.

ఎల్వీ రేవంత్ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో జన్మించాడు. 1900 ఫిబ్రవరి 10న జన్మించాడు. ఇండియన్ ఐడల్ గా కూడా ఎదిగాడు. పలు సినిమాల్లో 200కి పైగా పాటలు పాడాడు. ఎంఎం కీరవాణి, కోటి, మణిశర్మ, తమన్ లాంటి సంగీత దర్శకుల దగ్గర పాటలు పాడాడు. 2017లో సోనీ మ్యూజిక్ చానల్ నిర్వహించే ప్రముఖ ‘ఇండియన్ ఐడల్ 9’ విజేతగా నిలిచాడు.
Also Read: భీమ్లా నాయక్ సినిమా నుంచి ‘అంత ఇష్టం ఏందయ్యా’ పాటని ఎందుకు కట్ చేసారంటే ?
రేవంత్ విశాఖపట్నంలో పెరిగాడు. వేద పాఠశాలలో చదివాడు. సంప్రదాయ సంగీతం నేర్చుకోలేదు. అతడి కుటుంబానికి సంగీతం తెలియదు.కానీ కేవలం పాటల మీద ఆసక్తితో డిగ్రీ వదిలేసి మరీ తన ప్రతిభను నిరూపించుకునే హైదరాబాద్ వచ్చి అవకాశాలు దక్కించుకొని సింగర్ గా ఎదిగాడు.
ఇటీవలే రేవంత్ పెళ్లి చేసుకున్నాడు. గుంటూరుకు చెందిన అన్వితను తన భార్యగా స్వీకరించాడు. పెళ్లి తరువాత వచ్చిన తొట్టతొలి పండుగ ‘మహా శివరాత్రి’ కావడంతో ఈరోజు దేవాలయాన్ని సందర్శించి ఆ శివుడికి క్షీరాభిషేకం చేశారు. దోష నివారణ పూజలు చేశారు. నూతన దంపతులకు పూజారులు ఆశ్వీరచనాలు అందించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Also Read: 20 ఏండ్ల తర్వాత ఆ ఛాన్స్.. పవన్‌ను ఊరిస్తున్న రికార్డు