Wife And Husband : భార్య తన భర్తకు ఏ వైపున నిద్రపోవాలి.. ఏ వైపు పడుకుంటే లాభాలు!

భర్తకు భార్య ఎప్పుడు ఎడమవైపున నిద్రపోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ఎడమవైపు పడుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత బలపడటంతో పాటు భార్యకు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ వైపున నిద్రపోవడం వల్ల శరీర అవయవాలు అన్ని మెరుగ్గా పనిచేస్తాయి. ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

Written By: Srinivas, Updated On : August 26, 2024 7:38 pm

Wife And Husband

Follow us on

Wife And Husband :  వివాహ బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత భార్యాభర్తలు కొన్ని నియమాలను పాటించాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే కొన్ని సూచనలు పాటించక తప్పదు. అయితే సాధారణంగా పెళ్లి లేదా ఇంకా ఏదైనా పూజ జరిగిన భార్య.. భర్తకు ఎడమ వైపునే కూర్చుంటుంది. అసలు భార్యలు ఎడమ వైపు ఎందుకు కూర్చోవాలి అనే సందేహం మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది. సాంప్రదాయం ఏదైనా సరే.. మీరు గమనిస్తే సాధారణంగా భార్యలు భర్తలకు ఎడమ వైపునే కూర్చుంటారు. ఇదిలా ఉండగా భార్యలు భర్తలకు ఏ వైపున నిద్రపోవాలి. ఎటు సైడు నిద్రపోతే భార్యకు బోలెడన్నీ లాభాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అయితే ఇవన్నీ మూఢ నమ్మకాలు అని.. ఇంకా ఈరోజుల్లో కూడా ఇలాంటివి పాటిస్తారా? అని చాలా మంది భావిస్తారు. కానీ మన పెద్దలు చెప్పే ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. దీనికి కూడా ఉంది. మరి భర్తకు ఏ వైపున నిద్రపోవడం వల్ల భార్యలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటుందో తెలుసుకుందాం.

భర్తకు భార్య ఎప్పుడు ఎడమవైపున నిద్రపోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ఎడమవైపు పడుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత బలపడటంతో పాటు భార్యకు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ వైపున నిద్రపోవడం వల్ల శరీర అవయవాలు అన్ని మెరుగ్గా పనిచేస్తాయి. ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే ఎడమ వైపు నిద్రపోవడం వల్ల తక్కువగా గురక పెడతారు. దీనివల్ల మీ భర్తకు ఇబ్బంది ఉండదు. అలాగే భర్తకు ఎడమవైపు నిద్రపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. ఇలా నిద్రపోతే శరీరంలోని వ్యర్థాలు అన్ని చిన్న పేగు నుంచి పెద్ద పేగులోకి వెళ్లిపోతాయి. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఆరోగ్యంగా ఉంటారు. వీలైనంత వరకు భర్తకు ఎడమవైపున నిద్రపోవడానికి ప్రయత్నించండి.

భర్తకు ఎడమవైపున భార్య నిద్రించడం వలన మహిళల గుండె ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇలా పడుకుంటే గుండె‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదు. చాలామంది మహిళలు నడుం నొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాళ్లు ఎడమవైపున నిద్రపోవడం వల్ల నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. వెన్నునొప్పి పూర్తిగా తగ్గుతుంది. గర్భిణులు ఎక్కువగా ఎడమవైపున మాత్రమే నిద్రపోవాలి. ఇలా నిద్రపోతే గర్భాశయానికి, పిండానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో బిడ్డ అభివృద్ధి మంచిగా జరుగుతుంది. అలాగే ఎడమవైపున నిద్రపోవడం వల్ల ఎసిడిటీ సమస్యలు కూడా తగ్గుతాయి. వీటితో పాటు శ్వాస మెరుగుపడటంతో పాటు గుండెపై ఎలాంటి ఒత్తిడి కూడా ఉండదు. ఆందోళన, ఒత్తిడి, మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి. కేవలం వాస్తు ప్రకారం కాకుండా.. ఆయుర్వేదం ప్రకారం పండితులు చెబుతున్నారు. మన పెద్దలు ఏదైనా చెప్పారంటే ప్రతిదానికి ఓ సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. వాటిని దృష్టిలో ఉంచుకునే ఈ విషయాలను చెబుతుంటారు. కానీ ఈ కాలం మనుషులు వాళ్లవి మూఢ నమ్మకాలు, చేదస్తాలు అని అంటుంటారు.