Health Tips : మీ ఇంట్లో ఈ వస్తువులు వాడితే క్యాన్సర్ తప్పదు.. తస్మాత్ జాగత్త!

ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను వాడటం వల్ల మనకి తెలియకుండానే క్యాన్సర్‌కి వెల్‌కమ్ చెప్పినట్లే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఇంట్లో మనం వాడే ఏ పదార్థాలతో క్యాన్సర్ వస్తుందో మరి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Written By: Neelambaram, Updated On : August 26, 2024 7:51 pm

Health Tips

Follow us on

Health Tips : మన బాడీ పీల్చే గాలి నుంచి తినే ఫుడ్ అన్ని కూడా కలుషితమైనవే. మారిన జీవనశైలి లేదా రసాయనాలతో వస్తువులు తయారీ చేయడం వల్ల అన్ని కలుషితం అయిపోతున్నాయి. దీనివల్ల చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఒకప్పుడు అన్ని సహజంగా తయారు చేసే వస్తువులను వాడేవాళ్లు. కానీ ప్రస్తుతం మొత్తం కెమికల్ అయిపోయింది. ఆఖరికి మనం తినే ఫుడ్ కూడా మొత్తం కలుషితమే. అయితే నిత్యం మనం ఇంట్లో కొన్ని వస్తువులను వాడుతుంటాం. ఇవి ఆరోగ్యానికి మంచివే కదా.. వీటితో ఎలాంటి సమస్య రాదని మనం భ్రమలో ఉంటాం. కానీ ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను వాడటం వల్ల మనకి తెలియకుండానే క్యాన్సర్‌కి వెల్‌కమ్ చెప్పినట్లే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఇంట్లో మనం వాడే ఏ పదార్థాలతో క్యాన్సర్ వస్తుందో మరి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

నాన్‌స్టిక్ వంట పాత్రలు
ఈరోజుల్లో చాలామంది ఎక్కువగా నాన్‌స్టిక్ వంట పాత్రలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే వీటికి టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది. వీటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేసేటప్పుడు వీటి నుంచి హానికరమైన పెర్ప్లోరినేటెడ్ రసాయనాలు విడుదల అవుతాయి. వీటివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటికి బదులు కాస్ట్ ఐరన్, సిరామిక్ వంట పాత్రలను ఎంచుకోవడం బెటర్.

సువాసనల కొవ్వొత్తులు
చాలామంది సువాసనల కోసం కొవ్వొత్తులను వాడుతుంటారు. వీటిని ఇంట్లో ఎక్కువగా వాడటం వల్ల టోల్యూన్, బెంజీన్ వంటి హానికర రసాయనాలు విడుదల అవుతాయి. ఇవి చాలా ప్రమాదకరం. ఈ రసాయనాల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి సువాసన గల కొవ్వొత్తులను వాడకుండా బీ వ్యాక్స్ కొవ్వొత్తులను వాడటం మంచిది.

చాపింగ్ బోర్డు
ఇంట్లో కూరగాయలు కట్ చేయడానికి చాపింగ్ బోర్డు వినియోగిస్తారు. అయితే ఇది పాడైతే కొందరు దీనిని పడేయకుండా వాడుతుంటారు. దీంతో ఇందులో ఉండే మైక్రో ప్లాస్టిక్ ఆహారం ద్వారా శరీరంలోకి వెళ్తుంది. కాబట్టి కర్ర చాపింగ్ బోర్డు వాడటం మంచిది.

ప్లాస్టిక్ డబ్బాలు
అందరి ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు, కప్పులు ఉంటాయి. ఈ ప్లాస్టిక్ వస్తువుల్లో బిస్పెనాల్ ఎ, థాలేట్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి. దీంతో ఆరోగ్యానికి ఎలాంటి సమస్య ఉండదు. అలాగే పర్యావరణం కూడా సురక్షితంగా ఉంటుంది.

గృహ క్లీనర్లు
ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ప్రతి ఇంట్లో క్లీనింగ్ ఉత్పత్తులు ఉంటాయి. అయితే వీటిలో ఫార్మాల్డిహైడ్, అమ్మెనియా, క్లోరిన్, బ్లీచ్ వంటివి రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరానికి హానికరం. వీటివల్ల క్యాన్సర్ ముప్పు ఉందని వైద్యులు అంటున్నారు. ఇలా రసాయనాలు ఉండే వాటిని వాడటం కంటే సహజంగా వెనిగర్, బేకింగ్ సోడా సొంతంగా ఇంట్లోనే తయారు చేసుకోవడం మేలు.