Airplane Food : విమాన ప్రయాణంలో తినే ఆహారం రుచిగా ఎందుకు ఉండదో తెలుసా మీకు?

ఫ్లైట్‌లో తయారు చేసే ఆహారంపైన అనేక పరిశోధనలు జరిగాయి. గాలిలోకి వెళ్లే కొలది తేమ పెరుగుతుంది. ఇది ఆహారంపై ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఆకాశంలో అధిక స్థాయికి చేరుకున్న తర్వాత మన రుచి మారిపోతుంది. కేవలం ఇది రుచి మీద మాత్రమే కాకుండా వాసన మీద కూడా ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి.

Written By: Bhaskar, Updated On : August 26, 2024 7:12 pm

Airplane Food

Follow us on

Airplane Food : ప్రస్తుతం మారిన జీవనశైలికి తగ్గట్లుగా మనుషులు వాళ్ల అలవాట్లను మార్చుకుంటున్నారు. చాలామంది ఈరోజుల్లో ఏదో ఒక ప్రదేశానికి వెళ్తుంటారు. ఇలా వెళ్లేటప్పుడు వాళ్ల బిజీ షెడ్యూల్ వల్ల ఎక్కువగా విమాన ప్రయాణాన్నే ఎంచుకుంటున్నారు. దీనికి ముఖ్య కారణం.. తొందరగా గమ్య స్థానాన్ని చేరుకోవడంతో పాటు సమయం కూడా వృథా కాదనే భావిస్తున్నారు. అకస్మాత్తుగా ఏదైనా పని ఉన్నా లేదా విదేశాలకు వెళ్లాలనుకుంటే తప్పకుండా విమాన ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ఖర్చుతో అయి సమయం ఉంటే బస్సు లేదా రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే ఈ ప్రయాణాలు చేసేటప్పుడు కొందర అక్కడ ఫుడ్ కొనుక్కోవడం లేదా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి తీసుకెళ్తుంటారు. అదే విమాన ప్రయాణం అంటే ఫుడ్ విషయంలో ఎలాంటి ప్లాన్ చేసుకోరు. అక్కడ ఏది దొరికితే అది కొని తింటాం. విమానాల్లో ఫుడ్ చాలా రేటు ఎక్కువగా ఉంటుంది. కానీ అంత టెస్టీ అయితే అనిపించదు. దీంతో చాలామంది తినడానికి ఇష్టపెట్టుకోరు. కానీ తప్పక కొన్నిసార్లు తింటుంటారు. అయితే విమానంలో తినే ఆహారం అంత రుచిగా ఉండదు. అసలు రుచిగా ఉండకపోవడానికి కారణం ఏంటో మీకు తెలుసా?

ఫ్లైట్‌లో తయారు చేసే ఆహారంపైన అనేక పరిశోధనలు జరిగాయి. గాలిలోకి వెళ్లే కొలది తేమ పెరుగుతుంది. ఇది ఆహారంపై ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఆకాశంలో అధిక స్థాయికి చేరుకున్న తర్వాత మన రుచి మారిపోతుంది. కేవలం ఇది రుచి మీద మాత్రమే కాకుండా వాసన మీద కూడా ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. విమానంలో ఉండే గాలిలో 20 శాతం తేమ మాత్రమే ఉంటుంది. దీంతో ఆ తేమ ఆహారంపై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల ఆహారం కొంచెం పొడిబారడంతో మనకు రుచిగా అనిపించదు. గాలిలో ఉండే తేమను బట్టి రుచి, వాసన శక్తి ఉంటుందని తెలిపారు. ఫ్లైట్‌లో తక్కువ సమయం స్పేస్ ఉంటుంది. అలాగే తేమ ఉండదు. శబ్ధం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనం వాసన, రుచి చూసే సామర్థ్యాన్ని కోల్పోతాం. దీనివల్లే విమానంలో ఉండే ఆహారం మన ఇంట్లో వండినంత టేస్టీగా ఉండదు.

ఏ విమాన సంస్థ కూడా తన ప్రయాణికులకు టేస్ట్ లేని ఫుడ్ ఇవ్వాలని అనుకోదు. మన రుచిలో మార్పుల వల్ల ఫుడ్ టేస్ట్ మనకు అలా అనిపిస్తుంది. 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించేటప్పుడు మనం తీపి, ఉప్పు, కారం వంటి పదార్థాలను కేవలం 20 నుంచి 30 శాతం కంటే తక్కువగా గ్రహిస్తామని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే విమానంలో పనీర్, చీజ్, మష్రూమ్, మాంసం, టమాటా, సీఫుడ్స్‌ను కొంచెం టేస్టీగా ఆస్వాదించవచ్చని చెబుతున్నారు. మరి మీరు ఎప్పుడైనా విమాన ప్రయాణం చేశారా? చేస్తే ఫ్లైట్‌లో ఫుడ్ మీకు కూడా ఇలానే టెస్టీగా లేకపోవడం అనిపించిందా? అనిపిస్తే కామెంట్ చేయండి.