Mobile Number:సాధారణంగా మనం ఎవరికైనా మన ఫోన్ నెంబర్ చెప్పేటప్పుడు సరిగ్గా 10 నెంబర్లు వచ్చాయో లేదో చెక్ చేయమని చెబుతాను. 10 నెంబర్లు సరిగ్గా ఉంటేనే మనం చెప్పిన ఫోన్ నెంబర్ కరెక్ట్ అని అర్థం. అయితే మనం మన దేశంలో ఏ ఫోన్ నెంబర్ వాడిన కేవలం పది అంకెలు మాత్రమే ఉంటాయి. కేవలం మన దేశంలో ఫోన్ నెంబర్లు 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉండాలి? 9 లేదా 11 అంకెలు ఉంటే ఫోన్ కనెక్ట్ కాదు. కేవలం 10 ఉంటేనే ఫోన్ కనెక్ట్ అవుతుంది. అసలు ఇలా మన ఫోన్ నెంబర్లు కేవలం పది అంకెలు మాత్రమే ఉండటానికి కారణం ఏమిటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
ఇవి కూడా చదవండి: Pushpa: కేరళలో పుష్ప సందడి.. ఇప్పటి నుంచే స్పెషల్ షోస్‌కు బుకింగ్ స్టార్ట్!
ఫోన్ నెంబర్ 10 అంకెలు ఉంటే ఎన్నో రకాల నెంబర్లను తయారు చేయవచ్చు కనుక భవిష్యత్తులో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈ క్రమంలోనే 2003 వ సంవత్సరం వరకు కేవలం తొమ్మిది అంకెలు ఉన్న ఫోన్ నెంబర్ ప్రస్తుతం 10 అంకెలుగా మారింది. జనవరి 15, 2021 నుండి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసేముందు సున్నా యాడ్ చేసి నెంబర్ డయల్ చేయాలని సూచించింది. కేవలం ఈ మార్పు వల్ల 2544 మిలియన్ అదనపు నెంబర్లను తయారు చేసే అవకాశం కలిగిందని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి: Zodiac sign: రాశిని బట్టి మీరు పెళ్లి చేసుకోవాలనుకునే వారు ఎలా ఉంటారో తెలుసా?