సాధారణంగా పెళ్లి చేసుకునే సమయంలో ప్రతి ఒక్కరు తనకు కాబోయే వారు ఇలా ఉండాలి అలా ఉండాలి అని కలలు కంటారు. అయితే రాశి ప్రకారం ఒక వ్యక్తి పెళ్లి గురించి ఒక విధమైన భావన కలిగి ఉంటారు అలాగే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచన చేస్తారు. మరి ఏ రాశి వారు ఎలా ఉంటారు ఇక్కడ తెలుసుకుందాం…
వృషభం: ఈ రాశి వారికి డబ్బు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వీరు డబ్బుకి ఎంతో విలువ ఇస్తారు కనుక వీరికి కాబోయే లైఫ్ పార్ట్నర్ కూడా డబ్బు గురించి ఆలోచించే వారే కావాలి అని భావిస్తారు.
మిధునం: మిధున రాశి వారు అందరితో ఎంతో కలుపుగోలుగా ఉంటారు. ఈ రాశి వారు వారి జీవిత భాగస్వామిలో సాహసం చేసే లక్షణాలు ఉండాలని కోరుకుంటారు.
కర్కాటకం: ఈ రాశివారు మంచి భోజన ప్రియులు. వీరికి మంచి ఆహారం లభిస్తే చాలు ఎంతో ఆనందంగా గడుపుతారు కనుక జీవిత భాగస్వామి కూడా అలాంటి వారే రావాలని కోరుకుంటారు.
సింహం: సింహ రాశి వారు అన్నిటికంటే ముందుగా నమ్మకానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు కనుక వీరు జీవిత భాగస్వామిని కూడా ఎంతో ఆలోచించి నమ్మకం కలిగిన వ్యక్తిను మాత్రమే ఎన్నుకుంటారు.
కన్య రాశి: ఈ రాశి వారు ఎంతో భిన్నంగా ఉంటారు జీవిత భాగస్వామి విషయంలో ఎలాంటి మార్పులు జరిగిన ఎంతో ప్రశాంతంగా ఉంటారు. ఏదైనా ఒక విషయంలో ఒత్తిడి కలిగితే దాని గురించి ఆలోచిస్తారు.
తుల: తులారాశి వారు ఎంతో రొమాంటిక్ గా ఉంటారు కనుక వీరికి ప్రేమను పంచే జీవితభాగస్వామి కోసం ఎదురు చూస్తుంటారు.
వృశ్చికం: వృశ్చిక రాశి వారు వారి జీవిత భాగస్వామి విషయంలో ఏ మాత్రం తొందరపడరు. వీరికి కేవలం నమ్మకం కలిగిన వ్యక్తులను, వీళ్ళ అభిప్రాయాలను గౌరవించే వారిని మాత్రమే జీవిత భాగస్వామిగా ఎన్నుకోవడానికి ఇష్టపడతారు.
ధనస్సు: ఈ రాశి అగ్నిని సూచిస్తుంది కనుక ఈ రాశి వారు ఎంతో శక్తివంతంగా ఉంటారు కనుక వీరు జీవిత భాగస్వామి కూడా అంతే అలాగే శక్తి కలిగి ఉండి సాహసం చేసేవారు ఉండాలని భావిస్తారు.
మకరం: మకర రాశి వారు ఎంతో రొమాంటిక్ గా ఉంటారు కనుక జీవిత భాగస్వామిగా అలాంటి వ్యక్తులు రావాలని భావిస్తారు.
కుంభం: కుంభ రాశి వాళ్లు ఎంతో తెలివైన వాళ్ళు కనుక వారి జీవిత భాగస్వామి కూడా అలాగే ఉండాలని, తెలివైన వారి కోసం ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఈ రాశి వారు స్నేహితులు బంధువులతో ఎంతో సున్నితంగా కలిసిపోతారు.
మీనం: మీన రాశి వారు ఎంతో తెలివైన వారు వీరు కేవలం వారికి నచ్చిన వారిని పొగుడుతూ అభినందిస్తారు వీరికి ఎంతో సింపుల్ గా ఉండే వారు నచ్చుతారు.
Also Read: హీరోయిన్ తో ఆ హీరోకు ఎఫైర్.. కేవలం తాత్కాలికమేనట?