https://oktelugu.com/

KCR vs BJP: ఏంది బై ఇదీ! ఈ బీజేపీవోళ్లున్నారే.. కేసీఆర్ ను రోడ్డునపడేస్తారా?

KCR vs BJP: ‘‘ఏందీ బై ఇదీ.. ఆయన మానాన ఆయన ఏదో ఎవరిని డిస్ట్రబ్ చేయకుండా గా ప్రగతి భవన్ లో సల్లగా కూర్చుంటే ఈ బీజేపీవాళ్లకు పనిలేదా? ఏందీ? ఊరికే పుల్లలు పెడుతూ పెద్ద సార్ కు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. వరి కొనుగోలు కేంద్రాలపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తగ్గేదే లే అంటున్నాడే.. ఇక హుజూరాబాద్ ఓటమి కాకిపుండలా పొడుస్తూనే ఉందే’’ అంటూ టీఆర్ఎస్ శ్రేణుల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోందట.. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2021 / 01:41 PM IST
    Follow us on

    KCR vs BJP: ‘‘ఏందీ బై ఇదీ.. ఆయన మానాన ఆయన ఏదో ఎవరిని డిస్ట్రబ్ చేయకుండా గా ప్రగతి భవన్ లో సల్లగా కూర్చుంటే ఈ బీజేపీవాళ్లకు పనిలేదా? ఏందీ? ఊరికే పుల్లలు పెడుతూ పెద్ద సార్ కు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. వరి కొనుగోలు కేంద్రాలపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తగ్గేదే లే అంటున్నాడే.. ఇక హుజూరాబాద్ ఓటమి కాకిపుండలా పొడుస్తూనే ఉందే’’ అంటూ టీఆర్ఎస్ శ్రేణుల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోందట.. తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కార్ ను ప్రశాంతంగా ఉండనీయడం లేదే అని బీజేపీపై ఇప్పుడు గుర్రుగా ఉన్నారట గులాబీ దండు.

    kcr vs bjp

    బీజేపీ బలపడకుండా ఉండేందుకే ఎన్నడూ బయటకు రాని కేసీఆర్ సారూ.. తాజాగా రోడ్డునపడ్డాడు. ఇదంతా బీజేపీలో వాళ్లు చేసిన కుట్ర, కుతంత్రం.. ఇంకా ఏదైనా పెద్ద పదాలు ఉంటే కూడా వాడొచ్చేమో.. సార్ హయాంలో అసలే తెలంగాణ ప్రశాంతంగా ఉందంటే.. ఎప్పుడూ బయటకు రాకుండా ప్రజలను కలవకుండా.. సచివాలయానికి పోకుండా ప్రగతి భవన్ నుంచే కడుపులో చల్ల కదలకుండా పాలిస్తున్న కేసీఆర్ సార్ ను ఇలా రోడ్డెక్కి మహా ధర్నాలు చేయించడం భావ్యమా? అని మేం ఈ బీజేపీవోళ్లను అడుగదలుచుకున్నాం..

    హుజూరాబాద్ లో ఓడిస్తిరి.. కేసీఆర్ కు ప్రశాంతత లేకుండా చేస్తిరి.. టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని నిరూపిస్తరి.. ఇంత చేస్తిరి.. మా కేసీఆర్ సార్ ను ఇప్పుడు రోడ్డున పడేస్తరి.. అందుకే ఇది ‘న్యాయమా అధ్యక్ష’ అని అభిమానులు ఆందోళన చెందున్నారు.

    ఎప్పుడూ రాని కేసీఆర్ ఏకంగా మహాధర్నాకు ఇందిరాపార్క్ లో కూర్చోవడం.. ఒక సీఎం రోడ్డు ఎక్కడం ఇప్పుడు సంచలనమైంది. మంత్రి కేటీఆర్ నుంచి మొదలుకొని అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ఈ మహాధర్నాకు వచ్చేశారు. బీజేపీని నిగ్గదీసి అడిగేశారు.

    ఇంతటి బలమైన కేసీఆర్ ను సైతం రోడ్డెక్కేలా చేసిన బీజేపీని నిజంగానే మెచ్చుకోవాల్సిందే. గడిచిన ఏడేళ్లుగా హానీమూన్ లా సాగిన కేసీఆర్ పరిపాలనకు ఇక నుంచి అలా సాగదని అర్థమైపోయింది. బీజేపీ వల్ల ఇప్పటిదాకా ఒక లెక్కా.. ఇప్పుడో లెక్క అన్నట్టుగా మారింది. మరి ఈ రాజకీయాలు ఇంకా ఎలా మారుతాయి? కేసీఆర్ గల్లీలో చేసిన ధర్నాలు ఢిల్లీలో చేస్తారా? బీజేపీపై ఇంతే స్థాయిలో పోరాడుతారా? అన్నది వేచిచూడాలి.