https://oktelugu.com/

Relationship : పెళ్లయిన భర్త పరస్త్రీని ఎందుకు కోరుకుంటాడు.. దీనికి గల కారణాలేంటి?

డెలివరీ తర్వాత బాడీలో హార్మోన్ల మార్పుల వస్తాయి. దీంతో చాలామంది మహిళలకు శృంగారంపై ఆసక్తి తగ్గుతుంది. దీంతో భర్తపై తక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 22, 2024 / 09:30 PM IST

    Relationship

    Follow us on

    Relationship : జీవితాంతం ఒకరి కోసం ఒకరు కలిసుండాలని ఘనంగా వివాహం జరిపిస్తారు. ఎల్లప్పుడు సుఖసంతోషాలతో, పిల్లలతో ఆనందంగా ఉండాలని డబ్బు ఖర్చు పెట్టి మరి పెళ్లి చేస్తారు. కానీ ఈరోజుల్లో చాలామంది పెళ్లయిన కొన్నిరోజులే మంచిగా ఉంటున్నారు. ఆ తర్వాత ఎవరికి సంబంధం లేనట్లు ఉంటున్నారు. వ్యక్తిగత కారణాలు లేదా ఇంకా ఇతర సమస్యల వల్ల తొందరగా విడాకులు తీసుకుంటున్నారు. వీటితో పాటు పెళ్లయిన పురుషుడు తన భార్యతో సంతోషంగా ఉండకుండా పరస్త్రీతో సంబంధం పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం చాలామంది జీవితాల్లో ఇది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. అసలు భార్య ఉండగా భర్త పరస్త్రీని ఎందుకు కోరుకుంటున్నాడు. భార్య గతంలో ఎన్ని తప్పులు చేసి ఉన్న పెళ్లయితే మాత్రం తన భర్తే జీవితంగా బ్రతుకుతుంది. కానీ భర్త మాత్రం అలా కాదు. వివిధ కారణాల వల్ల భార్యను వదిలేసి వేరే మహిళతో సంబంధం పెట్టుకుంటారు. రోడ్డుపై వెళ్తున్న ప్రతి స్త్రీని చూసి కోరుకుంటాడు. అసలు దీనికి గల కారణాలేంటి? ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.

    శారీరకంగా సంతృప్తి లేకపోతే
    పెళ్లయిన తర్వాత ఇద్దరి మధ్య శృంగారం తప్పనిసరి. కేవలం మానసికంగా మాత్రమే కాకుండా శారీరక బంధం కూడా ఇద్దరి మధ్య ముఖ్యమే. శారీరకంగా అతినికి ఉన్న కోరికలన్నింటిని తన భర్తతో తీర్చుకోవాలని అనుకుంటాడు. వీటిని తన భార్య అంగీకరించకపోతే శారీరకంగా అసంతృప్తి చెందుతాడు. వైవాహిక బంధంలో శారీరకంగా పురుషుడు సంతృప్తి చెందకపోతే పరస్త్రీతో సంబంధం పెట్టుకోవడానికి మక్కువ చూపిస్తాడు. తన భార్య దగ్గర దొరకని ఆనందాన్ని వేరే స్త్రీ దగ్గర నుంచి కోరుకుంటాడు. ఇలాంటివి చివరకు భార్యాభర్తలు విడిపోవడానికి కారణం అవుతుంది.

    ఇద్దరి మధ్య నమ్మకం లేకపోవడం
    నమ్మకం లేకపోతే ఏ బంధం కూడా బలపడదు. భార్యాభర్తలు అన్నాక ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. అలా లేకుండా పార్ట్‌నర్‌ను అనుమానిస్తే ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. ఇద్దరికీ ప్రశాంతత ఉండదు. దీంతో వేరే వాళ్లతో రిలేషన్ పెట్టుకుంటారు. కాబట్టి అన్ని రకాలుగా పార్ట్‌నర్‌ను అర్థం చేసుకోవాలి. ఇద్దరి మధ్య అపార్థాలకు అసలు చోటు ఇవ్వకూడదు.

    బిడ్డ పుట్టిన తర్వాత
    డెలివరీ తర్వాత బాడీలో హార్మోన్ల మార్పుల వస్తాయి. దీంతో చాలామంది మహిళలకు శృంగారంపై ఆసక్తి తగ్గుతుంది. దీంతో భర్తపై తక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా భర్త కంటే పుట్టిన బిడ్డను ఎక్కువగా ఇష్ట పడటం వల్ల భర్త ఇతరులతో సంబంధం పెట్టుకునే అవకాశం ఉంది.

    ప్రతి విషయానికి గొడవ
    భార్యాభర్తలు అన్నాక అన్ని విషయాలు అర్థం చేసుకుంటూ ముందుకు పోవాలి. కానీ కొందరు మహిళలు చిన్న విషయాలకు గొడవ పడుతుంటారు. ప్రతి దాంట్లో భాగస్వామి తప్పునే వెతుకుతుంటారు. ఇలా చిన్న విషయాలకు గొడవలు పడితే భాగస్వామి మీద ఇష్టం పోతుంది. దీంతో వేరే వాళ్లతో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి వైవాహిక జీవితంలో దంపతులిద్దరికి అర్థం చేసుకునే గుణం ఉండాలి. లేకపోతే వివాహ బంధం డేంజర్‌లో పడుతుంది.