https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ గా మారిపోయిన బిగ్ బాస్ ‘శివాజీ’..థియేటర్స్ దద్దరిల్లిపోయాయిగా!

నంద్యాల ఘటన తర్వాత జరిగిన పరిణామాలను ఉద్దేశిస్తూ 'నాకు ఇష్టమైన వాళ్ళ కోసం, నా మనసుకి నచ్చితే, నేను ఎంత దూరమైనా వస్తా' అంటూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో పెను దుమారం రేపాయి.

Written By:
  • NARESH
  • , Updated On : August 22, 2024 / 09:23 PM IST

    Shivaji

    Follow us on

    Allu Arjun : సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లు అర్జునే కనిపిస్తున్నాడు. నిన్న రాత్రి ఆయన ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథి గా హాజరయ్యాడు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబిత ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది. సుకుమార్ కుటుంబం తో అల్లు అర్జున్ ఎంతో స్నేహంగా ఉంటాడు కాబట్టి, ఈ ఈవెంట్ కి విచ్చేసి మూవీ టీం కి ఆశీర్వాదం అందించాడు. ఇదంతా పక్కన పెడితే ఈ ఈవెంట్ లో ఆయన నంద్యాల ఘటన తర్వాత జరిగిన పరిణామాలను ఉద్దేశిస్తూ ‘నాకు ఇష్టమైన వాళ్ళ కోసం, నా మనసుకి నచ్చితే, నేను ఎంత దూరమైనా వస్తా’ అంటూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో పెను దుమారం రేపాయి.

    అంటే నాకు ఇష్టమైన వాళ్ళు ఏ పార్టీ లో ఉన్నా నేను సపోర్ట్ చేస్తాను, ఎవరేమి అనుకున్నా నాకు అనవసరం అన్నట్టు దాని అర్థం. మానిపోయిన గాయంపై కారం చల్లి లేపడం అంటే ఇదేనేమో. అందుకే మండిపోయిన మెగా అభిమానులు అల్లు అర్జున్ పై నేడు తమ కోపాన్ని బయటపెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా మెగా అభిమానులు మరోసారి థియేటర్స్ వైపు క్యూ కట్టి పండుగ వాతావరణం ని తలపించారు. అయితే ఈ సినిమాలోని ఇంటర్వెల్ సన్నివేశం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. నటుడు శివాజీ చిరంజీవి మరుదులు ని ప్రేమించాను దయచేసి పెళ్లి చెయ్యండి అని కాళ్ళు పట్టుకుంటాడు. చిరంజీవి పెళ్ళికి ఒప్పుకొని ఇద్దరికీ పెళ్లి చేస్తాడు. ఆ సమయంలోనే హీరోయిన్ ఆర్తి అగర్వాల్ వచ్చి ‘ఎరా వీర మనోహర్ రెడ్డి..ఇంకా పెళ్లి పీటలు మీద కూర్చున్నావే..పైకి లే’ అంటుంది. అప్పుడు శివాజీ కన్నింగ్ ముఖ కవలికలతో పొగరుగా పైకి లేచి చిరంజీవి పై అరుస్తాడు. చిరంజీవి ఒక్కసారిగా షాక్ కి గురి అవుతాడు. ఈ సన్నివేశం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.

    నేడు ఈ సన్నివేశం థియేటర్స్ లో వచ్చినప్పుడు అభిమానులు అల్లు అర్జున్ ని ఎగతాళి చేసిన వీడియోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అలా బిగ్ బాస్ శివాజీ ఒక్క్కసారిగా సోషల్ మీడియా మొత్తం అల్లు అర్జున్ పుణ్యామా అని తెగ ట్రెండ్ అయిపోయాడు. ఇకపోతే ఇంద్ర చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు అదిరిపోయాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయట. ఓవర్సీస్ లో అయితే ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పెట్టేసారు. కేవలం నార్త్ అమెరికా నుండే ఈ సినిమాకి లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. పూర్తి రిపోర్ట్ కాసేపట్లో అధికారికంగా రానుంది.