https://oktelugu.com/

Vishwambara Movie Story : మెగాస్టార్ ‘విశ్వంభర’ కథ వింటే మీ రోమాలు నిక్కపొడుచుకుంటాయి..సంక్రాంతికి వార్ వన్ సైడ్ అయ్యేలా ఉందిగా!

చిరంజీవి ఆంజనేయ స్వామి వరప్రసాదంగా భూలోకంలో జన్మిస్తాడట. అలాగే ఈ సినిమాలో చిరంజీవి కి , ఆంజనేయ స్వామికి ఎన్నో సన్నివేశాలు కూడా ఉంటాయట. వాటిని చూస్తే అభిమానుల రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. దేవుడి నేపథ్యం లో వస్తున్న సినిమాలు ఈమధ్య కాలం లో పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ ని ఊపేస్తున్నాయి.

Written By:
  • Vicky
  • , Updated On : August 22, 2024 / 09:31 PM IST

    Vishwambara Movie

    Follow us on

    Vishwambara Movie Story  : రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మూడు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టి నేటి తరం స్టార్ హీరోలకు సవాలు విసిరిన సంగతి అందరికీ తెలిసిందే. అభిమానులకు మరోసారి వింటేజ్ మెగాస్టార్ మాస్ అంటే ఏంటో, ఆ మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఏ స్థాయిలో ఉంటుందో రుచి చూపించాడు. అలాగే రీ ఎంట్రీ తర్వాత అంతకు ముందు ఎన్నడూ మెగా అభిమానులు చూడని ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఇచ్చాడు. అవే ఆచార్య, భోళా శంకర్. ఈ రెండు సినిమాలకు కనీసం ఓపెనింగ్ వసూళ్లు కూడా లేదు. భోళా శంకర్ చిత్రానికి అయితే ‘ఖైదీ నెంబర్ 150 ‘ కి మొదటి రోజు వచ్చిన వసూళ్లు, క్లోసింగ్ లో వచ్చాయి. కొన్ని ప్రాంతాలలో అయితే ఆ చిత్రం రెండు దశాబ్దాల క్రితం వచ్చిన చిరంజీవి అట్టర్ ఫ్లాప్ ‘మృగరాజు’ ని కూడా దాటలేకపోయింది.

    అలాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత చిరంజీవి చేస్తున్న చిత్రం ‘విశ్వంభర’. వసిష్ఠ దర్శకత్వం లో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం పైన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చెయ్యగా, దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘విశ్వంభర’ గ్లిమ్స్ వీడియో ని వినాయక చవితి సందర్భంగా విడుదల చెయ్యబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతూ అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి ఆంజనేయ స్వామి వరప్రసాదంగా భూలోకంలో జన్మిస్తాడట. అలాగే ఈ సినిమాలో చిరంజీవి కి , ఆంజనేయ స్వామికి ఎన్నో సన్నివేశాలు కూడా ఉంటాయట. వాటిని చూస్తే అభిమానుల రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. దేవుడి నేపథ్యం లో వస్తున్న సినిమాలు ఈమధ్య కాలం లో పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ ని ఊపేస్తున్నాయి.

    ఉదాహారానికి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హనుమాన్’ చిత్రం ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. స్టార్ హీరోలకు ఇప్పటి వరకు సాధ్యం కానీ గ్రాస్ వసూళ్లను ఈ సినిమా రాబట్టింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. తేజ సజ్జ అనే కొత్త కుర్రాడు దేవుడి బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తేనే ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే, ఇక చిరంజీవి లాంటి మెగాస్టార్ చేస్తే ఏ స్థాయి వసూళ్లు వస్తాయో ఊహించుకోవచ్చు. జనవరి 10 కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.