https://oktelugu.com/

Karthika Masam: కార్తీక మాసంలో వన భోజనాలు ఎందుకు చేస్తారు? ఎక్కడ చేయాలి?

స్వామి వారికి అభిషేక పూజలు నిర్వహించి, స్వామి వారి ప్రాంగణంలో కుటుంబాల సమేతంగా అరిటాకుపై భుజించడం వంటివి చేశారు. ఈ వన భోజన కార్యక్రమాన్ని తిలకించడానికి పలమనేరు పట్టణ కొంత మంది ప్రముఖులు పాల్గొన్నారు.

Written By: Neelambaram, Updated On : November 20, 2023 5:43 pm
Follow us on

Karthika Masam: కూర్మయి వరదరాజ స్వామి ఆలయంలో వన భోజన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వన భోజన కార్యక్రమం లో అనాదిగా వస్తున్న హిందూ సంప్రదాయం ప్రకారం వెజిటేరియన్ వంటకాలు చాలా అద్భుతంగా వండారు. కుటుంబ వ్యవస్థ, ఐక్యత, సోదర భావం కోసం ప్రతి ఏటా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి, దూర పట్టణ, నగర ప్రాంతాల్లో ఉన్న వారిని ఒక వేదికపై చూడటం, ఒక్క రోజన్న ఇంటిల్లిపాది కలుసుకొని ముచ్చటించుకోవడం, సోదర భావం కోసం ఇలాంటి కార్యక్రమాలు హిందూ సంప్రదాయంలో నిర్వహించడం ఒక శుభ పరిణామం గా కొలుస్తారట.

స్వామి వారికి అభిషేక పూజలు నిర్వహించి, స్వామి వారి ప్రాంగణంలో కుటుంబాల సమేతంగా అరిటాకుపై భుజించడం వంటివి చేశారు. ఈ వన భోజన కార్యక్రమాన్ని తిలకించడానికి పలమనేరు పట్టణ కొంత మంది ప్రముఖులు పాల్గొన్నారు. కార్తీక మాసం వస్తసే చాలు వన భోజన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, అనాదిగా వస్తున్న హిందూ సంప్రదాయం, చిన్న పెద్ద తేడా లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవాలయ సన్నిధిలో ఉన్నటువంటి చెట్టు నీడలో ఆడుతూ పాడుతూ సరదాగా వంటలు వండి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆరగించడం వంటి కార్యక్రమాలు చూస్తుంటాం..

ఏడాది కాలంలో ఎప్పుడు కుదిరినా కుదరకపోయినా బంధు మిత్రులతో కలిసి వనభోజనాలు చేయడం అద్భుతంగా ఉంటుంది. వన భోజన కార్యక్రమం అనేది ఐక్యతకు చిహ్నం అని చెబుతుంటారు. ఇదే రోజు విష్ణు మూర్తిని అర్చించి వన భోజనం చేసిన వారికి సకల పాపాలు తొలుగుతున్నాయన్నది నమ్మకం. పురాణంలోని మాట, ఈ సంప్రదాయాన్ని తరుచుగా చూస్తుంటే వన భోజనానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో అర్థం అవుతుంది. దీంతో ఇప్పుడు ప్రపంచంలో పోటీ పడి మరీ వన భోజనాలు చేస్తున్నారు.

అయితే ఎక్కడ పడితే అక్కడ వన భోజనాలు చేస్తే కార్తీక వన భోజనం అనరు. దేవాలయ సన్నిధిలో ఉన్న చెట్టు నీడలో వంట చేస్తే అది వన భోజనంగా గుర్తిస్తాం. భోజనం కూడా అరిటాకు, విస్తారాకులో మాత్రమే భుజించాలి. లేటెస్ట్ గా వచ్చినటువంటి ప్టేట్స్ లో భుజించకూడదు. పర్యావరణ పరిరక్షణ అనే భావన ఈ వన భోజనాల్లో అంతర్లీనంగా దాగి ఉంది. దీన్ని ప్రతి హిందూ సోదరుడు గుర్తించాలని శాస్త్రాలు తెలిసిన వారు అంటున్న మాట.