https://oktelugu.com/

Boiled Egg vs Omelette: ఉడకబెట్టిన గుడ్డు? ఆమ్లెట్? ఈ రెండింటిలో ఏది మంచిది?

గుడ్డుతో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది గుడ్డును ఉడికించో లేదా ఆమ్లెట్ గా వేసుకుని తింటారు. అయితే ఈ రెండింటిలో ఏది మనకు మేలు చేస్తుంది

Written By: , Updated On : November 20, 2023 / 05:47 PM IST
Boiled-Egg-vs-Omelette
Follow us on

Boiled Egg vs Omelette: జిమ్ చేసిన, సన్నగా ఉన్నా, బలం లేకపోయినా, నీరసంగా ఉన్నా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పే మాట రోజు ఒక గుడ్డు తీసుకోండి అంటారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే ఆహారపదార్థాలలో గుడ్లు కూడా ఒకటి. గుడ్డు మంచి పోషకాహారంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒక గుడ్డులో సుమారుగా 72 కేలరీలు, 6 గ్రాముల ప్రొటీన్లు, 5 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ప్రోటీన్స్ విషయానికి వస్తే చాలా మంది ఆధారపడేది గుడ్డు మీదనే.

గుడ్డుతో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది గుడ్డును ఉడికించో లేదా ఆమ్లెట్ గా వేసుకుని తింటారు. అయితే ఈ రెండింటిలో ఏది మనకు మేలు చేస్తుంది అనే అనుమానం ఎప్పుడైనా మీకు కలిగిందా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే.. గుడ్డులో అధిక నాణ్యత గల ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఉడకబెట్టడం అనే ప్రక్రియ గుడ్డులోని చాలా పోషకాలను సంరక్షిస్తుంది. గుడ్డులో ఉండే విటమిన్స్ B12, D, రిబోఫ్లావిన్ లు, అమైనో ఆమ్లాలు, ప్రొటీన్లు ఉడకబెట్టడం వల్ల శరీరానికి తగినట్టు సరళంగా మారతాయి. సులభంగా జీర్ణమవుతాయి కూడా.

ఉడికించిన గుడ్డులో కోలిన్ అనే పోషకం మెదడు ఆరోగ్యానికి, అభివృద్ధికి సహాయపడుతుంది. ఉడకబెట్టిన గుడ్డును తినడం అంటే మంచి పోషకాహారాన్ని తీసుకోవడమే. గుడ్డును పగలగొట్టి వేసే ఆమ్లెట్ కూడా మంచి ఆహారమే. అయితే ఆమ్లెట్ వేసేటప్పుడు అదనంగా నూనె లేదా ఇతర పదార్థాలు కలుపుతారు. అందువల్ల పోషకాలతో పాటు కొంత చెడు కొలెస్ట్రాల్ కూడా శరీరంలోకి వెళుతుంది. అలాగే నూనె వేసి వేయించడం వల్ల కొన్ని పోషకాలు కూడా పోయే ప్రమాదం ఉంది. అయితే ఆమ్లెట్ కు జోడించే కూరగాయల వల్ల మంచి కూడా జరుగుతుంది. ఏదేమైనా గుడ్డును ఆమ్లెట్ రూపంలో తీసుకోవడం కంటే ఉడకబెట్టి తినడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు.