children crying: పడకగదిలో వెలుతురు ఉంటే పిల్లలు భయపడకుండా నిద్రపోతారనే సంగతి తెలిసిందే. అయితే కొంతమంది పిల్లలు తెల్లవారుజామునే నిద్ర లేస్తుంటారు. పిల్లలకు త్వరగా మెలుకువ రావడం వల్ల తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవు. రాత్రి సమయంలో పిల్లలను త్వరగా నిద్రపుచ్చితే మంచిది. బెడ్ రూమ్ లో పరదాలు వేయడం ద్వారా బయట పిల్లలను త్వరగా సులభంగా నిద్రపుచ్చవచ్చు.
పిల్లల వయస్సుతో పాటే ఏడుపు కూడా మారుతుంది. పిల్లలు ఏడుపు ఆపాలంటే ఎత్తుకోవడం మంచి మార్గం కాగా ఎత్తుకున్నా పిల్లలు ఏడుపు ఆపకపోతే ఊయలలో వేసి నిద్రపుచ్చాలి. పిల్లలు ఆకలితో బాధ పడుతుంటే పాలు తాగించడం ద్వారా ఆ సమస్య దూరమవుతుంది. కొంతమంది పిల్లలు జ్వరం వస్తే కలిగే శారీక నొప్పుల ద్వారా ఏడ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
పిల్లలు ఏడుస్తున్న సమయంలో గట్టిగా అరవడం చేయకూడదు. శిశువు నిద్రలో కదిలే సమయంలో ఎత్తుకోకూడదు. ఇలా చేస్తే శిశువు తిరిగి నిద్రలోకి జారుకోవడం కష్టమవుతుంది. శిశువు కదిలిన సమయంలో నిద్రపుచ్చితే శిశువు ప్రశాంతంగా నిద్రపోతారు. పసిపిల్లలకు తగినంత నిద్ర ఉండాలి.