Revengeful Monkeys: సాధారణంగా అయితే పాములు పగబడతాయని తెలుసు. కానీ కోతులు కూడా పగబడతాయా? అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రతీకారం తీర్చుకునే గుణం కోతుల్లో ఉందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది ఈ సంఘటన చూస్తుంటే. తమ కోతిపిల్లను చంపాయనే ఉద్దేశంతో కుక్కలను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతున్నాయి కోతులు. ప్రతీకారం తీర్చుకునే క్రమంలో అవి నిత్యం వందలాది కుక్కలను టార్గెట్ చేసుకుని చంపుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

మహారాష్ర్టలోని బీడ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటనతో అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. జిల్లాలోని ఓ గ్రామంలో ఓ కోతిపిల్లపై కొన్ని కుక్కలు దాడి చేసి చంపేశాయి. దీంతో కోతులు రగిలిపోతున్నాయి. కుక్క పిల్ల ఎక్కడ కనిపించినా వాటిని కర్కశంగా చంపుతున్నాయి. దీంతో గ్రామంలో కుక్క పిల్లలు కనిపించకుండా పోతున్నాయి.
Also Read: పూజలు, వ్రతాలు చేసేవారు ఉల్లిపాయ వెల్లుల్లి ఎందుకు తినకూడదో తెలుసా?
ఎక్కడ కుక్క పిల్ల కనిపించినా చేతుల్లోకి తీసుకుని భవనాల మీద నుంచో, చెట్ల మీద నుంచో కిందకు వదిలేస్తున్నాయి. దీంతో అవి కిందపడి మరణిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 250 కుక్క పిల్లలను కోతులు చంపేశాయంటే వాటిలో పగ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతులను కట్టడి చేయాలని కోరుతున్నారు.
కోతుల ప్రతీకారంతో కుక్క పిల్లలు లేకుండా పోయాయి. ఇప్పటివరకు ఉన్న అన్నింటిని చంపేశాయి. ఒక్క కుక్క పిల్ల మాత్రమే మిగిలింది. దీంతో కోతులను గ్రామం నుంచి బయటకు పంపించాలని అటవీ అధికారులను వేడుకుంటున్నా వారు పట్టించుకోవడం లేదు. ఫలితంగా కోతుల ఆగడాలు ఆగడం లేదు. కోతులు పిల్లలపై కూడా దాడులకు తెగబడుతున్నాయి.