Pushpa Box Office: ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. అయితే, ప్రేక్షకులను మెప్పించే కోణంలో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దాంతో సినిమాకు మిశ్రమ ఫలితాలు వస్తాయనుకున్నారు. కానీ, ఇప్పటివరకు అయితే.. కలెక్షన్స్ విషయంలో ‘పుష్ప’ ఏ మాత్రం తగ్గడం లేదు.

అల్లు అర్జున్ కెరీర్ లోనే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. పైగా భారీ అంచనాలతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కేవలం రెండు రోజుల్లోనే రికార్డుల మోత మోగిస్తోంది. రూ.వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. పైగా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.166 కోట్ల గ్రాస్ రాబట్టిన తెలుగు సినిమాగా కూడా పుష్ప కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.
మరి రెండో రోజు కలెక్షన్ల వివరాలు చూస్తే..
నైజాం 17 కోట్లు
సీడెడ్ 5.9 కోట్లు
ఉత్తరాంధ్ర 3.05 కోట్లు
ఈస్ట్ 2.11 కోట్లు
వెస్ట్ 2 కోట్లు
గుంటూరు 2.83 కోట్లు
కృష్ణా 1.91 కోట్లు
నెల్లూరు 1.47 కోట్లు
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 36.27 కోట్లు
Also Read: సినిమా టికెట్ల వివాదం.. జగన్ పంతమా? సినీ ఇండస్ట్రీ పట్టుదలా నెగ్గుతుందా?
తమిళ్ నాడు 2.98 కోట్లు
కేరళ 1.52 కోట్లు
కర్ణాటక 4.86 కోట్లు
నార్త్ ఇండియా (హిందీ) 3.29 కోట్లు
రెస్ట్ 1.35 కోట్లు
ఓవర్సీస్ 6.02 కోట్లు
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 56.29 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.
Also Read: సుకుమార్ ఆ మాట చెప్పగానే ‘పుష్ప’ స్పెషల్ సాంగ్కు సామ్ ఒప్పుకుందట?