History Of Toothbrush: మనం ప్రతీ రోజు మార్నింగ్ యూజ్ చేసే కంపల్సరీ వస్తువుల్లో టూత్ బ్రష్ ఉంటుంది. టూత్ బ్రష్ తో పళ్లు తోముకున్న తర్వాతనే మనం నెక్ట్స్ పనుల్లోకి వెళ్తుంటాం. అది సర్వసాధారణం. కాగా, ఈ టూత్ బ్రష్ లేక మునుపు మన పూర్వీకులు ప్రకృతిలో దొరికే వేప పుల్లలను బ్రష్ లుగా వాడారు. అయితే, ఇప్పటికీ కొందరు గ్రామీణ ప్రాంతాల్లో టూత్ బ్రష్ ను ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ టూత్ బ్రష్ ను ప్రపంచానికి పరిచయం చేసిన దేశం ఏదంటే..
ప్రపంచం మొత్తం దాదాపుగా ప్రతీ రోజు కంపల్సరీ యూజ్ చేసే టూత్ బ్రష్ ను చైనా ప్రపంచానికి పరిచయం చేసింది. చైనా రాజు డాతున్ కంటే కోసం ఈ బ్రష్ ను రూపొందించారు. రాజు తన పళ్లను శుభ్రం చేసుకునేందుకుగాను ఉపయోగపడే విధంగా బ్రష్ ను రూపొందించారు. అయితే, తొలినాళ్లలో టూత్ బ్రష్ ల హ్యాండిల్ ను ఎముక లేదా వెదురు చెక్కతో తయారు చేసేవారు. అలా తయారు చేసిన టూత్ బ్రష్‌తో పంది పళ్లను కూడా రుద్దేందుకు కూడా ఉపయోగించినట్లు తెలుస్తోంది.
Also Read: ఈ ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో పెడుతున్నారా.. ప్రాణాలకే ప్రమాదం?
ఈ క్రమంలోనే ఆధునిక టూత్ బ్రష్ ను తయారు చేశారు. ఇంగ్లాండ్ కు చెందిన విలియం అడిస్ అనే వ్యక్తి ఆధునికమైన బ్రష్ తయారు చేశాడు. అయితే, అగ్రరాజ్యం అమెరికా మాత్రం ఈ టూత్ బ్రష్ కు సంబంధించిన పేటెంట్ ను తొలుత దక్కించుకుంది. అలా అమెరికాకు చెందిన హెచ్ఎన్ వాస్వర్త్ టూత్ బ్రష్ కంపెనీ వారు పేటెంట్ పొందారు. వారు ఇక టూత్ బ్రష్ ల ఉత్పత్తి భారీ స్థాయిలోనే చేశారు. అలా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కు అవసరమయ్యే రీతిలో ఆకర్షణీయంగా, క్వాలిటీ బ్రష్ లను రూపొందించారు.
ఇటీవల కాలంలో టూత్ బ్రష్ లను ఉపయోగించని వారు అని కొందరు చెప్తున్నారు. అయితే, సరైన పద్ధతిలో టూత్ బ్రష్ ను ఉపయోగించేవారు కొద్ది మాంది మాత్రమేనని ఈ సందర్భంగా దంత వైద్యులు పేర్కొంటున్నారు. టూత్ బ్రష్ లేని జీవితాన్ని ఆధునిక కాలంలో అస్సలు ఊహించుకోలేమని అత్యధిక మంది అంటుండటం మనం చూడొచ్చు కూడా. అలా ఈ టూత్ బ్రష్ కు కూడా గొప్ప చరిత్రనే ఉందని ఓ రకంగా అయితే చెప్పొచ్చు.
Also Read: బక్కగా ఉన్నారా.. బలంగా మారాలంటే తినాల్సిన ఆహార పదార్థాలివే?