https://oktelugu.com/

Karthika Deepam January 27 Episode: స్పృహ కోల్పోయి కిందపడిపోయిన సౌర్య.. కన్నీటిలో మునిగిపోయిన కార్తీక్ కుటుంబం!

Karthika Deepam January 27 Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. హోటల్ లో పని చేస్తున్న కార్తీక్ ను చూసి దీప తట్టుకోలేక బాగా ఏడుస్తూ ఉంటుంది. మీరు ఇలాంటి పనులు చేయకూడదు డాక్టర్ బాబు అంటూ కార్తీక్ ను అక్కడినుంచి పంపిస్తుంది. ఇక దీప అక్కడే ఉంటూ కార్తీక్ చేసే పని కూడా చేస్తుంది. మరోవైపు ఆదిత్య తన ఫోన్ కనిపించడం లేదని శ్రావ్యతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 27, 2022 / 11:19 AM IST
    Follow us on

    Karthika Deepam January 27 Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. హోటల్ లో పని చేస్తున్న కార్తీక్ ను చూసి దీప తట్టుకోలేక బాగా ఏడుస్తూ ఉంటుంది. మీరు ఇలాంటి పనులు చేయకూడదు డాక్టర్ బాబు అంటూ కార్తీక్ ను అక్కడినుంచి పంపిస్తుంది. ఇక దీప అక్కడే ఉంటూ కార్తీక్ చేసే పని కూడా చేస్తుంది. మరోవైపు ఆదిత్య తన ఫోన్ కనిపించడం లేదని శ్రావ్యతో అంటాడు.

    Karthika Deepam January 27 Episode

    ఇక ఆనందరావు దగ్గరకు ఆశ్రమం వ్యక్తి వచ్చి ఇక్కడి నుంచి మీ ఇద్దరినీ మరో బ్రాంచ్ కి పంపిస్తున్నామని అంటాడు. మీరు రుద్రాణిని కొట్టడంతో.. మీకోసం ఎవరో వస్తున్నారని.. అందుకే మీ రక్షణ కోసం గురువుగారు మరో చోటకు పంపిస్తున్నారు అని అంటాడు. ఇక దీప ఇంట్లో ఉంటుంది. కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ ఇంట్లోకి వస్తాడు. కానీ కార్తీక్ తో మాట్లాడటానికి ఇష్టపడదు.

    Also Read: ‘మహేష్’ మరదలిగా ‘రానా’ హీరయిన్ ఖరారు

    దీప అలా చేయటంతో కార్తీక్ బాధపడుతూ ఉంటాడు. ఇక దీప కార్తీక్ వైపు చూస్తూ మీరు ఇలా చేయడం నాకు నచ్చదు డాక్టర్ బాబు అంటూ బాధపడుతుంది. ఇంతకుముందు మనం వీటి కంటే ఎక్కువ బాధలు పడ్డామని.. ఇప్పుడు మాత్రం మీరు ఇంట్లోనే ఉండాలి అని చెబుతుంది. ఇక కార్తీక్ దీప ని బాధ పెట్టడం ఇష్టం లేక దీప కోసం సరే అంటాడు. అప్పుడు దీప ముఖంపై కాస్త నవ్వు కనిపిస్తుంది.

    ఇక కార్తీక్ ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి దీప వచ్చి కాసేపు మాట్లాడుతుంది. ఇక కార్తీక్ తాను ఆశ్రమంలో మమ్మీ డాడీ చూశానని చెబుతాడు. దీప కూడా వాళ్ళని చూసానని చెబుతుంది. తరువాయి భాగంలో ఆడుతూ ఆడుతూ సౌర్య కింద పడిపోతుంది. వెంటనే కార్తీక్ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని ఏడుస్తూ అనడంతో ఇంట్లో డబ్బులు ఉండవు. కార్తీక్ ఏమి చేసేది లేక ఆశ్రమంలో ఉన్న తన తల్లి దగ్గరికి వెళ్లి డబ్బులు అడగాలని చూస్తాడు.

    Also Read: ప్రత్యేక వ్యాపారంలో కమల్ హాసన్ బిజీ !