Health Insurance Policy: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకునే వాళ్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో భారీస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే వైరస్ తీవ్రత తక్కువగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సీనియర్ సిటిజన్ల కొరకు కొన్ని ప్రత్యేక పాలసీలు ఉన్నాయి. ఈ పాలసీలను తీసుకోవడం ద్వారా తక్కువ ప్రీమియంతో వృద్ధాప్యంలో అవసరాలను తీర్చుకోవచ్చు.
అయితే బీమా పాలసీలను తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. బీమా పాలసీ తీసుకునే సమయంలో పాలసీకి సంబంధించిన అన్ని విషయాలపై అవగాహనను కలిగి ఉండాలి. బీమా కంపెనీని పాలసీ మినహాయింపుల గురించి, ఇతర విషయాల గురించి తప్పనిసరిగా పూర్తి వివరాలను అడిగి తెలుసుకోవాలి. పాలసీ తీసుకునే సమయంలో ఆరోగ్య స్థితికి సంబంధించిన కీలక విషయాలను సమర్పించాలి.
Also Read: పోస్టాఫీస్ స్కీమ్.. రూ.200 డిపాజిట్ తో రూ.10 లక్షలు పొందే ఛాన్స్!
పాలసీని క్లెయిమ్ చేయాలని భావించే సమయంలో సదరు సంస్థను సంప్రదించి బీమాకు సంబంధించిన పూర్తి వివరాల గురించి అవగాహనను కలిగి ఉండాలి. ప్రతి పాలసీకి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ ఒక్కోదానికి ఒక్కోలా ఉంటుంది. ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యల కవరేజ్ గురించి పూర్తి వివరాలను సమర్పించి మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
సరైన డాక్యుమెంట్లు, రిపోర్టులు అందిస్తే మాత్రమే కంపెనీ క్లెయిమ్ ను తిరస్కరించే అవకాశాలు ఉండవు. అలా చేయని పక్షంలో ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు. కంపెనీలను బట్టి, నిబంధనలను బట్టి పాలసీలో మార్పులు ఉంటాయి కాబట్టి పాలసీలను తీసుకునే వాళ్లు తగిన జాగ్రత్తలను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
Also Read: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. రూ.60 పొదుపుతో రూ.13 లక్షలు పొందే అవకాశం?