WhatsApp: వాట్సాప్ చాట్ డిలీట్ అయిందా.. ఏ విధంగా రికవరీ చేయాలంటే?

WhatsApp: మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక తప్పును చేస్తూ ఉంటారు. అయితే చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా ఆ తప్పును సరిదిద్దుకుంటే మంచిదని చెప్పవచ్చు. ప్రముఖ మెసేజింగ్ యాప్స్ లో ఒకటైన వాట్సాప్ యాప్ లో ఏ తప్పు చేసినా సరిదిద్దుకునే అవకాశం అయితే ఉంది. ఒకరికి పంపే మెసేజ్ ను మరొకరికి పంపితే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ తో తొలగించవచ్చు. వాట్సాప్ యాప్ లో రెండు […]

Written By: Kusuma Aggunna, Updated On : November 11, 2021 2:44 pm
Follow us on

WhatsApp: మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక తప్పును చేస్తూ ఉంటారు. అయితే చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా ఆ తప్పును సరిదిద్దుకుంటే మంచిదని చెప్పవచ్చు. ప్రముఖ మెసేజింగ్ యాప్స్ లో ఒకటైన వాట్సాప్ యాప్ లో ఏ తప్పు చేసినా సరిదిద్దుకునే అవకాశం అయితే ఉంది. ఒకరికి పంపే మెసేజ్ ను మరొకరికి పంపితే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ తో తొలగించవచ్చు.

వాట్సాప్ యాప్ లో రెండు రకాల బ్యాకప్ సిస్టమ్ లు ఉండగా అందులో ఫోన్ మెమొరీ ఒకటీ అయితే రెండోది క్లౌడ్ కావడం గమనార్హం. ఫోన్ ను పోగొట్టుకుంటే గూగుల్ డ్రైవ్ లేదా క్లౌడ్ లో స్టోర్ అయిన మెసేజ్ లను తిరిగి పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పొరపాటున వాట్సాప్ నుంచి చాట్ ను డిలీట్ చేసి ఆ చాట్ ను తిరిగి పొందాలని భావిస్తే వాట్సాప్ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసి మళ్లీ ఇన్ స్టాల్ చేయాలి.

ఆ తర్వాత వివరాలను నమోదు చేసి యాప్ ను రీ ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. వివరాలను నమోదు చేసిన అనంతరం వాట్సాప్ చాట్ బ్యాకప్ ను రీస్టోర్ చేయమంటారా? అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడు రీస్టోర్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయడం ద్వారా డిలీట్ అయిన ఛాట్ ను ఫోన్ లో పొందవచ్చు. చాట్ బ్యాకప్ ఆప్షన్ అందుబాటులో ఎనేబుల్ చేయకపోతే మాత్రం డిలీట్ అయిన చాట్ ను తిరిగి పొందడం సాధ్యం కాదని చెప్పవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు చాట్ ను సులభంగా రీస్టోర్ చేయవచ్చు. ఇందుకోసం యూజర్లు తమ ఫోన్ లో ఉన్న ఫైల్ మేనేజర్ యాప్ లో ఇంటర్నల్ స్టోరేజ్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీడియా ఫైల్ పై క్లిక్ చేసి డేటాబేస్ అనే ఫోల్డర్ ను క్లిక్ చేసి msgstore-yyyy-mm-dd.1.db.crypt14 నుంచి msgstore.db.crypt14 గా మార్చాలి. ఇలా చేసిన తర్వాత వాట్సాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసి ఇన్ స్టాల్ చేస్తే డిలీట్ అయిన మెసేజ్ లను తిరిగి పొందవచ్చు.

Also Read: వాట్సాప్ సెక్యూరిటీ కోడ్ నోటిఫికేషన్లు వస్తున్నాయా.. వాటిని ఎలా ఆపాలంటే?

జీమెయిల్ ఖాతా ఉన్నవాళ్లకు అలర్ట్.. లాగిన్ కావాలంటే ఇలా చేయాల్సిందే?