Site icon OkTelugu

Anil Ravipudi Copied Stories Controversy: అనిల్ రావిపూడి ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల కథలు కాపీనేనా..?

Anil Ravipudi Copied Stories Controversy

Anil Ravipudi Copied Stories Controversy

Anil Ravipudi Copied Stories Controversy: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్దడంలో చాలా మంది దర్శకులు కీలకపాత్ర వహిస్తారు. కమర్షియల్ సినిమాలు సక్సెస్ అవ్వాలంటే చాలా పెద్ద టాస్క్ ఉందనే చెప్పాలి. రొటీన్ గా చూసే సినిమాలకు భిన్నంగా కమర్షియల్ సినిమాలను చేయాలి. ఒక రకంగా అది కత్తి మీద సాము లాంటిదే. రాజమౌళి లాంటి దర్శకుడు వరుసగా 12 విజయాలతో ముందుకు దూసుకెళ్తుంటే అతని తర్వాత స్థానంలో అనిల్ రావిపూడి సైతం ఇప్పటివరకు 9 సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఆయన చేసిన ప్రతి సినిమా కమర్షియల్ సినిమానే కావడం విశేషం… ఆయన ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా ఏదో ఒక సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి తీశానని అతను చెబుతుంటే, కొంతమంది జనాలు మాత్రం అనిల్ రావిపూడి ఇతర సినిమాల కథలను కాపీ చేసి అతని కథలను రాసుకుంటాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: లోకేష్ కు అలా అవకాశం ఇచ్చిన చంద్రబాబు!

ఆయన ఫస్ట్ మూవీ ‘పటాస్’ ను బాలయ్య బాబు హీరోగా వచ్చిన ‘రౌడీ ఇన్స్పెక్టర్’ సినిమా నుంచి ఇన్స్పైర్ తీసినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత ‘సుప్రీమ్’ సినిమాని చిరంజీవి హీరోగా వచ్చిన ‘పసివాడి ప్రాణం’ సినిమా నుంచి తీసుకున్నాడు.

‘రాజా ది గ్రేట్’ సినిమాని ‘ఒక్కడు’ సినిమా ఇన్స్పిరేషన్స్ తో రాసుకున్నాడట. ‘ఎఫ్ 2’ సినిమాని ‘పెళ్ళాం ఊరెళితే’ సినిమా ఇన్స్పిరేషన్ తో రాసుకున్నట్టుగా అనిల్ రావిపూడి చెప్పాడు. ఇక రీసెంట్ గా వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాని సైతం ‘తులసి’, విశ్వాసం అనే రెండు సినిమాల ఇన్స్పిరేషన్స్ తో రాసుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను పెట్టి చేస్తున్న సినిమా ఏ కథ ఇన్స్పిరేషన్ తో రాసుకున్నాడు. ఆ కథ వల్ల సినిమా ఈ రేంజ్ లో ముందుకు వెళ్ళబోతుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కి మరో సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Exit mobile version