Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లో దొంగతనం, బెంబేలెత్తిపోయిన కాజల్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లో దొంగతనం, బెంబేలెత్తిపోయిన కాజల్

Bigg Boss 5 Telugu: బుల్లితెరలో దూసుకుపోతున్న నెంబర్ వన్ రియాలిటీ షో బిగ్ బాస్. నాగార్జున వరుసగా మూడోసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో విజయవంతంగా 66 రోజుల పూర్తి చేసుకుని పదో వారం కి చేరుకుంది. ఇంకొక 39 రోజులు మిగిలి ఉన్న ఈ షో లో ప్రతి రోజు ఎదొక రచ్చ జరుగుతూనే ఉంటుంది.

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి క్షణం అలెర్ట్ గా ఉంటూ… ప్రతీ స్టెప్పు చాలా స్మార్ట్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగిపోవాలి. ఏ ఒక్క సెకండు అయినా ఏమరుపాటు గా ఉన్నా జరగ కూడని దారుణాలు అన్నీ జరిగిపోతాయి. బుధవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో కూడా ఇదే జరిగింది. గుంట నక్క గా పేరు తెచ్చుకున్న రవి నిన్న జరిగిన ఎపిసోడ్లో కూడా అలానే తెలివిగా వ్యవహరించి మంచి పేరు సంపాదించుకున్నాడు.

రవి రాక్స్ – కాజల్ షాక్స్: కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి బీబీ హోటల్ అనే టాస్క్ ఇస్తాడు. ఇందులో రవి కి హౌస్ కీపింగ్ పోస్ట్, కాజల్ కి హోటల్ ఓనర్ స్నేహితురాలు అనే పోస్ట్ ని ఇస్తాడు. ఈ టాస్క్ లో హోటల్ సిబ్బంది అతిధుల నుంచి రూ. 15 వేల రూపాయలు సంపాదిస్తే వాళ్ళు గెలిచినట్లు లెక్క.

ఈ క్రమం లో కాజల్ బెడ్ రూమ్ లో ఉన్న సోఫా మీద కూర్చుని రవి చేత సేవలు చేయించుకుంటూ ఉంటది. ఒక్కసారిగా తన దగ్గర ఉన్న బాగ్ ని సోఫా మీద పడేసి బయటకి వెళ్తుంది. ఈ సమయం లో రవి బాగ్ లో ఉన్న రూ.1700 దొంగలించి బాత్రూం లో దాచుకుని సైలెంట్ గా ఉంటాడు. ఇలా చెయ్యడం వల్ల ఒక్కసారిగా టాస్క్ యొక్క స్థితే మారిపోతుంది. అందుకే బిగ్ బాస్ గేమ్ లో ప్రతి క్షణం చురుకుగా ఉండాలి అని ఇవ్వాళా చుసిన ఎపిసోడ్ చూస్తేనే అర్ధమవుతుంది.

NVN Ravali
NVN Ravali
Ravali is a Entertainment Content Writer, She Writes Articles on Entertainment and TV Shows.
Exit mobile version