Site icon OkTelugu

Mohan Babu: మోహన్ బాబు సినిమాల జోరు పెంచాడా..? విలన్ గా మరోసారి రాణిస్తాడా..?

Mohan Babu Paradise Entry Scene

Mohan Babu Paradise Entry Scene

Mohan Babu: సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని…ఎలాంటి క్యారెక్టర్ అయిన సరే అలవోకగా చేసి మెప్పించగలిగే నటులకు మాత్రమే అలాంటి ఒక ట్యాగ్ తగిలిస్తారు… ఇండస్ట్రీలో మోహన్ బాబు ను విలక్షణ నటుడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమాలో వైవిధ్య భరితమైన పాత్రలను పోషిస్తూ ఉంటాడు. ఒకప్పుడు విలన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కామెడీ విలన్ గా మారి హీరోగా కూడా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక తన మార్కెట్ ను పూర్తిగా కోల్పోయిన తర్వాత కొద్ది రోజుల నుంచి మోహన్ బాబు సినిమాలు చేయకుండా ఖాళీగానే ఉంటున్నాడు.

Also Read: లోకేష్ కు అలా అవకాశం ఇచ్చిన చంద్రబాబు!

తన కొడుకు విష్ణు చేసే సినిమాల్లో మాత్రమే నటిస్తున్నాడు. కానీ ఇప్పుడు నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ అనే సినిమాలో సైతం తను విలన్ పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. మాలిక్ అనే ఒక పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఇక దీంతో పాటుగా ‘అజయ్ భూపతి’ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం ‘ సినిమాలో సైతం ఆయన వెంకటప్ప నాయుడు అనే పాత్రను పోషిస్తున్నాడు.

రీసెంట్ గా ఆ పాత్రకు సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. మోహన్ బాబు మరోసారి తన సత్తాను చాటుతూ ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఈ సినిమాలతో మంచి ఇమేజ్ ని సంపాదించుకుంటే వరుసగా సినిమాలు చేస్తు ప్రేక్షకులను మెప్పించగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

తన కొడుకుల సినిమాలు చేసినవి చేసినట్టుగా ప్లాప్ అవుతుంటే మోహన్ బాబు సైతం కొంతవరకు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక తమ ఓన్ బ్యానర్ లోనే సినిమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్లకి సైతం కొన్ని నష్టాలైతే వస్తున్నాయి. అందువల్లే మోహన్ బాబు సైతం ఖాళీగా ఉంటే కుదరదని ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది…

Exit mobile version