Brahmam Garu Prediction: భారత దేశం సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రం, ఖగోళ శాస్త్రం, నమ్మకాలకు ప్రసిద్ధి.. మన పూర్వీకులు భవిష్యత్‌లో జరగబోయేది ముందే ఊహించి గ్రంథాల రూపంలో దానిని పొందుపరిచారని చరిత్రకారులు చెబుతుంటారు. వీటిలో బ్రహ్మంగారి కాలజ్ఞానం కూడా ఒకటి. చాలా మంది బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని విశ్వసిస్తుంటారు. ఆయన క్రీ.శకం 1622 నుంచి 1690 మధ్యకాలంలో జీవించారని తెలుస్తోంది. బ్రహ్మం గారిని చాలా మంది అధ్యాత్మిక గురువు అనుకునేవారట.. కానీ ఆయనొక హేతువాది చరిత్ర కారులు చెబుతున్నారు.

బ్రహ్మం గారు ఏపీలోని కడప జిల్లా బనగానపల్లిలో జీవనం సాగించారని కొందరు చెబుతున్నారు. నేటికీ అక్కడ ఆయన మఠం ఉన్నది. అక్కడి నుంచే ఆయన కాలజ్ఞానం రాశారని గ్రంథాలు చెబుతున్నాయి. భవిష్యత్‌లో ఏం జరగబోతోంది. ఎన్ని అనార్థాలు రానున్నాయని ముందే ఆయన రాసిన కాలజ్ఞానం ద్వారా హెచ్చరించారట.. కొవిడ్ మహమ్మారి గురించి కూడా అందులో ప్రస్తావించారని తెలుస్తోంది. ”కోరంకియను జబ్బుకోటిమందికి తగిలి, కోడిలాగ తూగిసచ్చేరయ” అంటూ ఆయన కాలజ్ఞానంలో పేర్కొన్నారు. దీని గురించి బ్రహ్మం గారు ముందే చెప్పారని సోషల్ మీడియాలో చాలా కథనాలు వైరల్ అవుతున్నాయి.
Also Read: ఇంటిపై హనుమంతుడి జెండా కట్టడం వల్ల కలిగే ప్రయోజనాలివే..
బ్రహ్మం గారు చెప్పిన విధంగానే 2020లో కరోనా రావడం లక్షల సంఖ్యలో జనాలు మరణించిన విషయం తెలిసిందే. కొవిడ్ తగ్గుముఖం పట్టింది అనుకునేలోపు ఇండియాలో డెల్టా ప్లస్, బ్రిటన్ నుంచి స్ట్రెయిన్ వైరస్, ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా నుంచి ఒమిక్రాన్, తాజాగా ఫ్రాన్స్‌లో మరో కొత్త వేరియంట్‌ను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది దశల రూపంలో నిజంగానే కోటి మందిని కబలిస్తుందని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే బ్రహ్మం గారు చెప్పిన విషయాలు చాలా నిజం అయ్యాయి. రాజరీక వ్యవస్థ, రాజుల పాలన అంతం, స్త్రీలు పురుషుల వలే వస్త్రాలు ధరించడం, ఉద్యోగాలు చేయడం, రాజ్యాన్ని ఒక మహిళా పాలించడం ( ఇందిరా గాంధీ), మూసీ వరదలు, కృష్ణా వరదలు ఇలా చాలా జరగడంతో జనం కూడా బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్టు అర్థమవుతోంది.
Also Read: ఈ లక్షణాలు మీలో ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు.. ఇతరలకు మార్గదర్శి కాగలరు..?