Viveka Murder Case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, దేవరెడ్డి శివశంకర్ రెడ్డి ప్రచారం మొదలుపెట్టారని వివేకా ఇంట్లో పనిచేసే మహిళా లక్ష్మీదేవి సీబీఐ అధికారులు తెలిపింది. మృతదేహానికి బ్యాండీడ్లు వేయాలని, కట్లు కట్టాలని వారు అనుకున్నారని చర్చించుకున్నట్టు తెలిపారు.

వివేకా గదిలోని రక్తపు మరకలను శుభ్రం చేయాలని తనను ఎర్ర గంగిరెడ్డి తనకు చెప్పాడని పనిమనిషి పేర్కొన్నారు. శుభ్రం చేయలేక తనకు వాంతులు అయ్యాయని చెప్పుకొచ్చారు. శుభ్రం చేయడం తన వల్ల కాదంటూ తాను కిచెన్ లోకి వచ్చేశానని తెలిపారు. అనంతరం అవినాష్ రెడ్డి ఇన్ స్పెక్టర్ తో కలిసి బెడ్ రూంలోకి వచ్చారని తెలిపారు. 2019 మార్చి 15న ఉదయం వివేకా ఇంటికి వెళ్లానని చెప్పుకొచ్చారు. లోపల అవినాష్ రెడ్డి ఫోన్ మాట్లాడుతూ కనిపించారని తెలిపారు.
Also Read: ఇండస్ట్రీలో జగన్ ను ఎదురించి నిలిచిన ఏకైక మొనగాడు పవన్ కళ్యాణ్ యేనా?
గదిలో కృష్ణారెడ్డి, ఇనయతుల్లాతో పాటు మరో పది మంది ఉన్నారని పేర్కొంది. వంట గదిలో వంట మనిషి పని చేసుకుంటోందని, వివేకా గుండెపోటుతో చనిపోయారనే విషయం ఆమెనే తనతో చెప్పిందని తెలిపింది. కొంతసేపటి తర్వాత ఇనయతుల్లా వచ్చి బెడ్ రూంలో ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేయాలని తనను పిలిచారని పేర్కొంది. ఆయనతో కలిసి బెడ్ రూంలోకి వెళ్లానని, అక్కడ గండిరెడ్డి, కృష్ణారెడ్డితో పాటు మరో ఇద్దు ఉన్నారని చెప్పుకొచ్చింది. చాలా చోట్లు రక్తపు మరకలు కనిపించాయంది. బెడ్ షీట్ పైన కూడా మరకలు ఉన్నాయని పేర్కొంది.

ఇదిలా ఉండగా వివేకా ఇంట్లో ఆరేండ్లుగా ఓ కక్కు ఉంటోంది. ఇంటి బయటే ఉంటే చెట్ల కింద ఉండేది. ఆ ఇంటి పరిసరాలకు ఎవరైనా కొత్త వారు వస్తే వారిని వెంబడించేంది. ఉన్నట్టుండి ఆ కుక్క కనిపించకుండా పోయింది. తర్వాత వివేకా హత్య చోటుచేసుకుంది. మరి ఆ కుక్క ఎలా చనిపోయిందో తెలియడం లేదు.
Also Read: ఆ ఐపీఎస్ కు కేసీఆర్ ఎందుకు పోస్టింగ్ ఇవ్వడం లేదు.. తెరవెనుక కథేంటి?