Surekha Vani Daughter Supritha: సినీ రంగంలో చాలామంది నటేమణులు తమ భర్తలతో విడిపోయి ఒంటరిగానే జీవిస్తున్నారు. అయితే ఇందులో చాలామంది తమ పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. భర్తతో విడాకులు తీసకుని పిల్లల భవిష్యత్‌ను చూసుకుంటున్నారు. అయితే మొన్న సింగర్ సునీత పెండ్లి అయిన తర్వాత ఇలాంటి వారి గురించి వార్తలు రావడం స్టార్ట్ అయ్యాయి. వారు కూడా రెండో పెండ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్లు వచ్చాయి.

అయితే భర్త చనిపోవడంతో కూతురు సుప్రితతో కలిసి జీవిస్తోంది నటి సురేఖ వాణి. ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా అందరికీ చాలా సుపరిచితురాలు. ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసిన సురేఖ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం బాధలు పడుతోంది. అయితే ఇప్పటికీ గ్లామర్‌ను మెయింటేన్ చేస్తోంది. ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఘాటు ఫొటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. అయితే ఈమె రెండో పెండ్లి చేసుకుంటుందనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి.
Also Read: ‘పునీత్ రాజ్ కుమార్’ చివరి చిత్రం పై భారీ అంచనాలు
ఈ నేపథ్యంలో ఆమె కూతురు సుప్రిత తాజాగా తల్లి పెండ్లి విషయం మీద స్పందించింది. తన తల్లికి కచ్చితంగా రెండో పెండ్లి చేయాలనే ఆలోచన తనకు ఉందని, అందుకోసమే ప్రయత్నిస్తున్నానని వివరించింది. కాగా ఈ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పుకొచ్చింది. కానీ ఈ పెండ్లి విషయంలో తనది తుది నిర్ణయం కాదని, తన తల్లికే ఆ నిర్ణయాన్ని వదిలిపెట్టినట్టు చెప్పుకొచ్చింది.

తనకు మాత్రం తన తల్లికి రెండో పెండ్లి చేయాలనే తాపత్రయం ఉందని, తన తల్లిని సంతోషంగా చూడాలన్నదే తన కోరిక అని వివరించింది. తన తల్లికి పెండ్లి చేస్తేనే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టు తన మనసులోని మాటలను బయట పెట్టేసింది. కాగా తన తండ్రి చనిపోయాక తల్లి మీద ఎన్నో పుకార్లు పుట్టించారని చెప్పుకుని బాధ పడింది.
అలాంటి బాధ నుంచి బయట పడుతుందని తన తల్లిని పార్టీలకు తీసుకెళ్తే.. చాలా దారుణంగా కామెంట్లు చేశారని వాటి వల్ల తాము ఎంతో బాధపడ్డామంటూ చెప్పుకువచ్చింది. అందుకే అలాంటి కామెంట్లను పట్టించుకోవడం మానేశామని, ఇప్పుడు తన తల్లి కెరీర్ మీదనే పూర్తి దృష్టి పెట్టిందని చెప్పుకొచ్చింది సుప్రిత. త్వరలోనే ఈమె కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి.
Also Read: నైజాంలో ‘భీమ్లా నాయక్’ సరికొత్త రికార్డ్.. సంతోషంలో థమన్ డ్యాన్స్ !
[…] Ishtam Movie Hero Charan Reddy: తన ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు చాలా గ్యాప్ తర్వాత నిర్మించిన సినిమా ‘ఇష్టం’. ఈ సినిమా 2001లో వచ్చింది. ఈ సినిమాలో హీరోగా నటించిన చరణ్ రెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, మంచి పేరు దక్కించుకున్నప్పటికీ.. మళ్లీ చరణ్ రెడ్డి ఏ సినిమాలో నటించలేదు. కానీ పదకొండేళ్ల తర్వాత అంటే 2012, మార్చి 19న ఆయన చనిపోయాడన్న వార్త వచ్చింది. ఆ వార్త విని అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యారు. […]
[…] Thaman Intersting Comments on Trivikram: పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద “భీమ్లా నాయక్” ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. పవన్ కళ్యాణ్ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘భీమ్లానాయక్’ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు సాగర్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. […]