Electricity Bill: కరెంట్ బిల్ వాచిపోతుందా? ఈ టిప్స్ పాటించండి

వేసవి వచ్చేసింది.ఎండను తెచ్చేసింది. వేడి ఎప్పుడో మొదలైంది. ఇక మార్చి నుంచి ఎండల తీవ్రత మొదలైంది. దీని వల్ల ప్రజలు ఇంట్లోనే ఉంటున్నారు.

Written By: Swathi, Updated On : April 21, 2024 2:32 pm

Electricity Bill

Follow us on

Electricity Bill: ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లో ఉండలేము. గాలి ఉండాలి లేదంటే చాలా కష్టమే. ఇంట్లో, బయట ఎక్కడ అంటే అక్కడ వేడిగా ఉంటే కచ్చితంగా ఉండటం కష్టమే. మరి ఫ్యాన్, కూలర్ రెండు ఉంటే రెండింటిని ఆన్ చేసుకుంటున్నారు. ఇక ఏసీని కొనుగోలు చేసేవారు కూడా ఉన్నారు. ఇక చల్లటి నీరు కోసం ఫ్రిజ్ కూడా ఉండాల్సిందే. లేదంటే కష్టమే. మరి ఎండాకాలంలో కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందా? ఈ కరెంట్ బిల్ ను తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? ఈ కొన్ని టిప్స్ చూసేయండి.

వేసవి వచ్చేసింది.ఎండను తెచ్చేసింది. వేడి ఎప్పుడో మొదలైంది. ఇక మార్చి నుంచి ఎండల తీవ్రత మొదలైంది. దీని వల్ల ప్రజలు ఇంట్లోనే ఉంటున్నారు. కరెంట్ బిల్ పేలిపోతుంది. అందుకే కరెంట్ బిల్ ను తగ్గించుకోండి. టీవీ, సెట్ టాప్ బాక్స్ వంటివి వాడిన తర్వాత వాటి మెయిన్ స్విచ్ కూడా ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. లేదంటే స్టాండ్ టై మోడ్ లో కూడా చాలా విద్యుత్తును వినియోగిస్తాయి.

ఏసీని 24-26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద రన్ చేయాలి. ఇలా చేస్తే గది ఉష్ణోగ్రత పాటు కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది. పాత ట్యూబ్ లైట్లు, బల్బులకు బదులు ఎల్ఈడీ బల్బులు వాడండి. రేడియేటర్, ఓవెన్, వంట ఉపకరణాలు వంటి ఏదైనా రకమైన వేడి వచ్చే ప్రదేశాల నుంచి మీ ఇంట్లోని రిఫ్రిజిరేటర్ ను దూరంగా ఉంచాలి.

ఇన్ఫ్రారెడ్ సెన్నార్ లు, మోషన్ సెన్నార్ లు, డిమ్మర్లు, సౌర విద్యుత్, ఆటోమేటిక్ టైమర్ వంటి పరికరాలు సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించాలి. ఇలాంటి టిప్స్ వల్ల మీకు సాధ్యమైనంత వరకు కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. చిన్న చిన్న టిప్స్ మరిన్ని ఉంటే మాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి.