Coriander: ఆకుకూరల్లో కొత్తిమీర కు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. కొత్తిమీర లేకుండా వంటలు ఉండవు. ఏకూర కైనా కొత్తిమీర వేస్తేనే దాని టేస్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది. దాని సువాసన తగిలితే చాలు కడుపులో ఆకలి బయలుదేరుతుంది. కొత్తిమీర వాడితే అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ధనియాల నుంచి వచ్చే కొత్తిమీర మన భారతీయ వంటకాల్లో ఎంతో విశిష్టతను కూడా చాటుకుంది. అందుకే ఇప్పుడు కొత్తిమీరను విపరీతంగా పండిస్తున్నారు రైతులు. సాధారణంగా కొత్తిమీర చిన్నపాటి మొక్కగా ఉంటుంది. కానీ ఇప్పుడు హైబ్రిడ్ పద్ధతిలో భారీగా పెరుగుతోంది.
బారెడు మొక్కలుగా..
సాధారణంగా కొత్తిమీర మూరెడు పెరగడమే కష్టం. అటువంటిది హైబ్రిడ్ విధానంలో భారీగా పెరిగిన కొత్తిమీర అన్నమయ్య( Annamayya ) జిల్లా కలికిరిలో కనిపించింది. రంగమ్మ అనే మహిళ తన పొలంలో కొత్తిమీర పండించారు. హైబ్రిడ్ విత్తనాలు వేయడంతో అది భారీగా పెరిగింది. భారీ మొక్కల రూపంలో కొత్తిమీర తీసుకొచ్చి విక్రయించడంతో అందరూ వింతగా చూశారు. దానిని కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. అయితే అంత భారీ సైజులో ఉన్న ఆ కొత్తిమీర కట్ట పది రూపాయలు అంటే జనాలు ఎగబడి కొనుగోలు చేశారు. అసలే సంక్రాంతి సీజన్ కావడంతో.. వంటకాల కోసం ఈ కొత్తిమీరను ఎక్కువ మంది కొనుగోలు చేశారు.
ఆరోగ్య సమస్యలకు చెక్..
కొత్తిమీర కేవలం వంటల్లో సువాసన కే కాదు ఆరోగ్య సమస్యలకు కూడా పనిచేస్తుంది.కొత్తిమీరను కషాయంగా మార్చి తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానిని కాషాయంగా మార్చి పాలు మరియు పంచదార కలిపి ఇస్తే మూలశంక వంటి రోగాలు కూడా మాయం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అజీర్ణ విరోచనాలు, కడుపులో మంట తగ్గడం, గ్యాస్ సమస్య, అజీర్ణం వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొత్తిమీర శరీరంలో మూడు దోషాలపై పనిచేస్తుందంటున్నారు. దాహం ఎక్కువ అయ్యే సమస్యను పోగొడుతుందని, జీర్ణవ్యవస్థ పై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. నేత్ర రోగాలు నయం కావడానికి కూడా దోహదపడుతుందని.