https://oktelugu.com/

Love Marriages : ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు ఎందుకు విడిపోతున్నారు? దీనికి గల కారణాలేంటి?

ప్రేమ వివాహంలో కూడా ఇలాంటివి కామన్ అయిపోయావి. రెండేళ్లు లేదా పదేళ్లు ప్రేమించుకున్న.. పెళ్లయిన రెండు, మూడు ఏళ్లకే విడిపోతున్నారు. ఏళ్ల తరబడి అంత ప్రేమించుకున్న వాళ్లు కనీసం కొన్నేళ్లు కూడా కలిసి ఉండకుండా ఎందుకు విడిపోతున్నారు. దీనికి గల కారణాలేంటి? ఈరోజు స్టోరీలో మనం తెలుసుకుందాం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 20, 2024 / 07:19 AM IST

    love Marriages

    Follow us on

    Love Marriages :  ఈరోజుల్లో చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఒకప్పటి రోజుల్లో అసలు ప్రేమ వివాహాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఈరోజుల్లో సగం కంటే ఎక్కువగా ఇవే జరుగుతున్నాయి. చిన్న వయస్సులోనే ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకోకుండా వివాహం చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు వచ్చి పెళ్లయిన కొన్నేళ్లకే విడిపోతున్నారు. ప్రస్తుత జనరేషన్‌లో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. పెద్దల కుదిర్చిన వివాహం అయితే విడాకులు తీసుకున్నారంటే.. తెలియని వ్యక్తి కదా అని అనుకోవచ్చు. మరి ప్రేమ వివాహంలో కూడా ఇలాంటివి కామన్ అయిపోయావి. రెండేళ్లు లేదా పదేళ్లు ప్రేమించుకున్న.. పెళ్లయిన రెండు, మూడు ఏళ్లకే విడిపోతున్నారు. ఏళ్ల తరబడి అంత ప్రేమించుకున్న వాళ్లు కనీసం కొన్నేళ్లు కూడా కలిసి ఉండకుండా ఎందుకు విడిపోతున్నారు. దీనికి గల కారణాలేంటి? ఈరోజు స్టోరీలో మనం తెలుసుకుందాం.

    వివాహ బంధం చాలా పవిత్రమైనది. కానీ ఈరోజుల్లో దీనికి విలువ లేకుండా పోతుంది. విడిపోయి ఉండలేమని కొందరు తొందరపడి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి అయి కనీసం ఏడాది కాకుండా కూడా కొందరు విడిపోతున్నారు. అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు విడిపోవడానికి ముఖ్య కారణం సర్దుకోకపోవడం వల్లే అని నిపుణులు అంటున్నారు. ఈరోజుల్లో జంటలు ఎలా ఉన్నాయంటే.. నాకు నచ్చింది నేను చేస్తాను. నాకు నచ్చినట్టు ఉంటాను. నువ్వు ఉంటే ఉండు లేకపోతే లేదని అంటున్నారు. ఒక బంధంలో ఎంతో కొంత అయిన సర్దుబాటు ఉండాలి. ఇద్దరూ కూడా కొన్ని విషయాల్లో తగ్గాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని ఇలా సర్దుకుంటేనే బంధం బలపడుతుంది. ఇద్దరూ కలిసి ఈగోకి పోతున్నారు. నువ్వేంటి నాకు చెప్పేది. నీ మాట నేను వినేదని గొడవ పడుతున్నారు. చిన్నది అలా కాస్త పెద్దది అయి.. చివరికి విడాకుల వరకు సాగుతుంది. ఏ బంధంలో అయిన కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి. ప్రతి విషయానికి కూడా ఈగోకి వెళ్లి, భాగస్వామి మాట వినకుండా ఉంటే ఆ బంధం రెండు ముక్కలు అవుతుంది. ఈరోజుల్లో అందరూ కూడా ప్రేమ వివాహాలే చేసుకుంటున్నారు. వీటికి తగ్గట్లుగానే విడాకులు కూడా అవుతున్నాయి.

    ప్రేమ వివాహాలు మాత్రమే కాకుండా పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా పెటాకులు అవుతున్నాయి. సెలబ్రిటీల నుంచి సామాన్య మనుషుల వరకు చాలా జంటలు విడాకులు తీసుకుంటున్నారు. కొందరు అయితే పెళ్లి, పిల్లలు అయిన తర్వాత కూడా భాగస్వామితో ఉండలేమని విడాకులు తీసుకుంటున్నారు. కానీ కొందరు వాళ్ల పిల్లల కోసం అయిన కూడా ఇష్టం లేకపోయిన బాధపడుతూ ఉంటున్నారు. ప్రేమ లేదా పెద్దలు కుదిర్చిన వివాహం అయిన కూడా అహంకారం లేకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలి. అప్పుడే బంధం బలంగా ఉంటుంది. ఈగోలకు పోయి.. మీ భాగస్వామిని దూరం చేసుకోవద్దు.