https://oktelugu.com/

Horoscope Today: ఈరోజు అరుదైన శుభయోగం.. ఈ రాశుల వారికి విశేష ప్రయోజనాలు..

ఈరాశి వారికి మహిళలతో ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల వారితో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా మాట్లాడడం మంచిది కాదు. లాభదాయకరమైన ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్యంలో అనేక మార్పులు వస్తాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : September 20, 2024 / 08:08 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై ఉత్తర భాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు అరుదైన శుభయోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారి ఆరోగ్యంలో మార్పులు ఉంటాయి. ఈరోజు చంద్రుడు మేష రాశిలో సంచరించనున్నాడు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఈరాశి వారికి మహిళలతో ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల వారితో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా మాట్లాడడం మంచిది కాదు. లాభదాయకరమైన ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్యంలో అనేక మార్పులు వస్తాయి.

    వృషభ రాశి:
    ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కొన్ని విషయాల్లో ప్రశాంతంగా ఉండాలి. అనవసరంగా కోపం తెచ్చుకోవద్దు. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. కొత్త స్నేహితులను కలుస్తారు.

    మిథున రాశి:
    పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ పెరిగే అవకాశం. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉంటారు.

    కర్కాటక రాశి:
    వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడుడు పెడుతారు. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలను చేరుతారు. విద్యార్థులు భవిష్యత్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.

    సింహారాశి:
    ఏ పని మొదలు పెట్టినా దానిని పూర్తి చేయాలి. డబ్బుకు సంబంధించి వ్యవహారాల్లో కీలక ఒప్పందాలు చేసుకుంటారు. సామాజిక రంగంలో పాల్గొనేవారు బిజీగా ఉంటారు. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మనసులో అలజడి ఉంటుంది.

    కన్య రాశి:
    కొన్ని పనులు అయిష్టంగానే చేస్తారు. కానీ వాటి ఫలితం ఉంటుంది. పరిమిత ఆదాయం వచ్చినా సంతృప్తి చెందుతారు. విద్యార్థులకు సాంకేతికంగా అభివృద్ధి చెందుతారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

    తుల రాశి:
    పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. అకస్మాత్తుగా ఆరోగ్యంలో మార్పులు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితుల నుంచి బహుమతులు పొందుతారు.

    వృశ్చిక రాశి:
    ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భార్యభర్తల మధ్య విభేదాలు ఏర్పడుతాయి. సోమరితనాన్ని వీడాలి. లేకుండా తీవ్రంగా నష్టపోతారు. శ్రమతో కూడిన పనులు పూర్తి చేస్తారు.

    ధనస్సు రాశి:
    అనవసరమైన వివాదాల్లోకి తల దూర్చొద్దు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడుతాయి. కొన్ని కారణాల వల్ల ఇంట్లో అశాంతి ఏర్పడుతుంది. మధ్యాహ్నం నుంచి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    మకర రాశి:
    తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. సోమరితనం వల్ల కొన్ని కష్టాలు ఏర్పడుతాయి. లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ఉద్యోగులు శ్రమ పడుతారు.

    కుంభరాశి:
    వివిధ మార్గాల నుంచి ఆదాయం వస్తుంది. ఇదే సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి. భవిష్యత్ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలు వేస్తారు.

    మీనరాశి:
    మనసులో గందరగోళం ఉంటుంది. ఇంటి అవసరాల కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలుతీసుకోవద్దు.