Wax Gourd: బూడిద గుమ్మడికాయ గురించి తెలియని వారుండరు. పూజలు, జిస్టి తీయడానికి గుమ్మడికాయను ఎంతగానో ఉపయోగిస్తారు. దసరా వస్తే చాలు ఫుల్ గిరాకీ ఉంటుంది. మరి ఈ గుమ్మడికాయతో ఉన్న లాభాలు ఏంటో తెలుసా? ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.. ఓ సారి ఆ వివరాలు మీకోసం..
బూడిద గుమ్మడికాయలను ఎక్కువగా తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ ఇందులో పోషకాలు అమోఘంగా ఉంటాయి. ఇది తీసుకుంటే జీర్ణక్రియను మంచిగా చేస్తుంది. దీని వల్ల మలబద్దకం సమస్య దూరం అవుతుంది. దీని రసాన్ని గనుక తీసుకుంటే పేగుల్లోని మురికిని క్లీన్ చేస్తుంది. కిడ్నీల్లో రాళ్లని కరిగించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ రసం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు దూరం చేస్తుంది. మూత్ర విసర్జనను కూడా ఈజీగా చేస్తుంది. మూత్రంలో చాలా మందికి మంట వస్తుంటుంది. దీన్ని తగ్గించడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది.
ఇమ్యూనిటీ పవర్… రోజు అవసరమయ్యే పోషకాలు అన్ని ఈ ఒక్క బూడిద గుమ్మడికాయలోనే ఉంటాయి. వీటిని రెగ్యూలర్ గా తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ మెండుగా ఉంటుంది. దీని వల్ల శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ జ్యూస్ ను తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.
షుగర్ కంట్రోల్..బూడిద గుమ్మడికాయకు షుగర్ ను కూడా కంట్రోల్ చేసే శక్తి ఉంది. డయాబెటిక్ పేషెంట్స్ కు బూడిద గుమ్మడికాయ రసం బెస్ట్ ఆప్షన్. రక్తంలో చక్కరని కంట్రోల్ చేసేందుకు సహాయం అవుతుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు దీనిని రెగ్యూలర్ గా తీసుకోవడం చాలా మంచిది.