Prabhas Anushka Marriage: తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ ఏజ్ పెరిగిపోతున్న కూడా ఇప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు ఎప్పుడు తన పెళ్లి ప్రస్తావన వస్తున్న కూడా దాన్ని దాటవేస్తూ సినిమాల్లో బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. ఇక ఇదే క్రమం లో ఈయన ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ పెళ్లి పైననే మరొకసారి చర్చ అనేది జరుగుతుంది.
అయితే నిజానికి ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఏంటి అన్న విషయాలను లోతుగా పరిశీలించి చూస్తే ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అనుష్క అని తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాస్ అనుష్క ఇద్దరు ఒకానొక టైంలో ఘాడం గా ప్రేమించుకున్నారని, అలాగే ఇద్దరూ కూడా ఒకరి ఇష్టాలు మరోకరికి చెప్పుకొని బాగా కలిసిపోయి ఉండే వారని వాళ్లకు సన్నిహితంగా ఉన్న చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఆ తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకుందామని అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరు పెళ్లి చేసుకోలేదనేది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక దాంతో వీళ్లిద్దరూ అప్పటినుంచి మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారని తెలుస్తుంది. అందుకే అటు అనుష్క , ఇటు ప్రభాస్ ఇద్దరు పెళ్లి చేసుకోవడం లేదు ఇక ఇద్దరు కూడా ఒంటరిగానే ఉంటున్నారు. ఇలా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకపోవడం చూసిన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రభాస్ ఈ సంవత్సరం కూడా పెళ్లి చేసుకోనట్టుగానే తెలుస్తుంది. ఇక అనుష్క అయితే ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో తను ఇప్పటి వరకు క్లారిటీ కూడా ఇవ్వడం లేదు. ఇక బాగా ప్రేమించుకున్న వీళ్లిద్దరూ విడిపోవడానికి గల కారణం ఏంటి అంటే అనే టాపిక్ మరోసారి తెర పైకి రావడం తో కొంతమంది చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ప్రభాస్ పెళ్లి తర్వాత అనుష్క ని సినిమాల్లో నటించవద్దని చెప్పాడట కానీ అనుష్కకి అది నచ్చకపోవడం వల్లనే తాను ప్రభాస్ తో మ్యారేజ్ కి ఒప్పుకొనట్టు గా వార్తలు వస్తున్నాయి.
అందువల్లే ఇద్దరు పెళ్లి అనేది వద్దు అనుకొని ఫ్రెండ్స్ గా ఉంటున్నట్టు గా తెలుస్తుంది. మరి ఇలాంటి క్రమంలో ఇప్పుడు కూడా అనుష్క ని అడిగితే ప్రభాస్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది అలాగే ప్రభాస్ ని అడిగితే అనుష్క తనకి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ తప్ప ఏమీ లేదని చెప్తూ వస్తున్నారు. అయినప్పటికీ వీరి మధ్య అంతర్లీనంగా ప్రేమ అనేది ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ అభిమానులు ఈ విషయం పట్ల వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…మారి ఇది ఎంతవరకు నిజమండీ తెలీదు కానీ వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే చూసి సంతోష పడే అభిమానులు చాలా మందే ఉన్నారు…