Husband And Wife Relationship: జీవితం పూలపాన్పు కాదు. కష్టనష్టాలు, లాభనష్టాలు అన్నీ కలగలిపి ఉంటాయి. కొందరికి ఎక్కువ.. కొందరికి తక్కువ కష్టాలు ఉంటాయి కావొచ్చు.. కానీ కష్టాల బారిన పడని వ్యక్తి లేరనే చెప్పవచ్చు. అయితే కొందరు ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని సొంతంగా తయారు చేసుకుంటారు. మరికొందరు ఇతరులపై ఆధారపడుతాయి. తాము కష్టాల్లో ఉన్నాం ఎవరైనా కాపాడండి మహాప్రభో.. అని వేడుకుంటున్నప్పుడు బంధువులు, స్నేహితుల్లో ఎవరో ఒకరు ఆదుకునే అవకాశం ఉంది. కానీ తీవ్రంగా నష్టపోయి.. కష్టాల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తిని ఒకే ఒక్కరు కాపాడగలుగుతారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా?
ఆడవాళ్ల కంటే మగాళ్లకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార బాధ్యతలు నిర్వహించడంతో పాటు కుటుంబ భారాన్ని కూడా మోయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కడో ఒక చోట కొన్ని పొరపాట్లు చేయడం వల్ల కష్టాలను ఎదుర్కొంటాడు. కొందరు ఎంతో ఆశతో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల తీవ్ర నష్టాలు ఎదురవుతాయి. మరికొందరికి ఏ జాబ్ చేసిన సంతృప్తిగా ఉండదు. నిత్యం ఆందోలనగా మారుతారు. ఇంకొందరు ఈ విషయాల్లో బాగున్నా.. కుటుంబ విషయాల్లో నష్టపోతూ ఉంటాయి. అయితే ఇలాంటి సందర్భంగా ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి సహచరిణి మాత్రమే.
కార్యేషు దాసి, కరణేసు మంత్రి అనే పాట వినే ఉంటారు. ఇది సరదాకు అనుపించినా.. ఇందులోని వ్యాఖ్యలు నిజమనే భావించాలి. ఒక పురుషుడికి బలం, బలహీనత తన భార్య మాత్రమే. తల్లిదండ్రుల మధ్య పెరిగినా.. ప్రతి వ్యక్తికి అసలైన జీవితం పెళ్లి తరువాతనే ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సమయంలో సహచరిణి అయిన భార్య ఇచ్చే ధైర్యమే అతనికి కొండంత బలం ఉటుంది.
ఒక వ్యక్తి తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు చాలా మంది భార్యలు వారిని హేళన చేస్తారు. వారు చేసే తప్పులు ఎత్తి చూపిస్తారు. అసలే తీవ్ర కష్టాల్లో ఉన్న వారికి మరిన్ని సూటిపోటీ మాటలతో కుంగదీస్తారు. అయితే ఇలాంటి సమయంలో భార్య తన భర్తకు సహకరిస్తూ నేనున్నాను అనే ఒకే ఒక్క మాట అతనికి కొండంత బలం ఇచ్చినట్లవుతుంది. కష్టాలు ఎప్పుడైనా వస్తాయి.. కానీ వాటి కోసం ఆలోచించకుండా వాటి పరిష్కారం దిశగా ఆలోచించే ప్రయత్నం చేయాలి.. అనే చిన్న మాట భార్య నుంచి వస్తే ప్రతి వ్యక్తి ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది.