Vastu Tips For Plants: ఇల్లును మొక్కల మయం చేయాలని.. ఏ మూలకు చూసినా మొక్కలు కనిపిస్తే అందంగా ఉంటాయని చాలా మంది అనుకుంటారు. అదే విధంగా మొక్కలను పెంచుతుంటారు కూడా. కొందరు ఇంటి ముందు పెంచితే మరికొందరు ఇంట్లో పెంచుతారు. అయితే ఇంట్లో అయినా బయట అయినా ఏ మొక్కలు పెంచాలి? ఎలాంటి మొక్కలు పెంచకూడదు అనే విషయం చాలా మందికి తెలియదు. కొన్ని మొక్కలు పెంచడం వల్ల మంచి జరిగితే కొన్ని మొక్కలు పెంచడం వల్ల చెడు జరుగుతుంది అంటున్నారు జ్యోతిష్యులు. అవేంటో తెలుసుకుందాం..
ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. అయితే తులసి చెట్టు లక్ష్మీ దేవికి ప్రతీక. ఈ చెట్టును ఆ తల్లి ఇష్టపడుతుంది కాబట్టి ఈ తులసి చెట్టును ఇంట్లో పెంచాలి.అంతేకాదు నిత్యం పూజలు కూడా చేయాలి. అయితే ఈ చెట్టును కొందరు తూర్పు, ఉత్తర దిశల్లో పెంచుతుంటారు. కానీ దక్షిణ దిశలో పెంచడం వల్ల మరింత మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాదు ఆర్థిక సమస్యలు తొలిగిపోయి అనారోగ్య సమస్యలు కూడా తొలిగిపోతాయి. ఇక తులిసి చెట్టు తో పాటు అలోవెరా చెట్టు కూడా ఇంట్లో ఉండటం చాలా మంచిది. ఈ చెట్టు కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇంటికి వాస్తు పరంగా కూడా చాలా అనుకూలమైంది.
మనీ ప్లాంట్ ని ఎప్పుడు ఆగ్నేయ దిశలో ఉంచాలి. ముఖ్యంగా కొన్ని పరిహారాలకు ఆరోగ్య ప్రయోజనాలకు ఈ మొక్క చాలా ఉపయోగపడుతుంది. మనీ ప్లాంట్, తులసి, అలోవెరా చెట్లు ఇంట్లో ఉండడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు జ్యోతిష్యులు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం కూడా తప్పనిసరిగా ఇంట్లో ఉండవలసిన మొక్కల్లో అలోవెరా తులసి మొక్కలు ప్రధానమైనవి. అలాగే స్నేక్ ప్లాంట్ ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలిగిపోయి జీవితంలో అభివృద్ధి ఉంటుంది.
ఇంట్లో పెంచకూడని మొక్కలు: పాలు కారే మొక్కలను ఎప్పటికీ కూడా ఇంట్లో పెంచకూడదు. వాస్తు ప్రకారం కూడా మంచిది కాదు కాబట్టి ఇంటికి దూరంగా ఉంచాల్సిందేనట. ఒక్క తెల్ల జిల్లేడు చెట్టు మినహాయించి పాల ఉత్పత్తి మొక్కలను ఇంట్లో పెంచకూడదట. ఈ మొక్కలు దురదృష్టాన్ని తీసుకొని వస్తాయట. గులాబీ ప్రతికూల శక్తితో పోరాడుతుందని నమ్ముతుంటారు. కాబట్టి ఇంట్లో పెంచాలి. ముఖ్యంగా కాక్టస్ మొక్కను ఇంట్లో పెంచితే నిత్యం గొడవలు అవుతుంటాయి. కాబట్టి ఈ మొక్కను పెంచకపోవడం చాలా మంచిది అంటున్నారు పండితులు.