Sri Reddy: షర్మిలక్క చెవులు మూసుకునేలా.. శ్రీరెడ్డి ఇమిటేషన్‌.. వైరల్‌ వీడియో!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్సార్‌ టీపీ మద్దతు ఇస్తుందని ప్రకటించిన షర్మిల ఎన్నికల తర్వాత తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్‌లో విలీనం చేశారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో హస్తం కండువా కప్పుకున్నారు.

Written By: Raj Shekar, Updated On : January 24, 2024 3:41 pm
Follow us on

Sri Reddy: వైఎస్‌.షర్మిల పరిచయం అక్కరలేని పేరు. మొన్నటి వరకు వైఎస్సార్‌ టీపీ అధినేత. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు. తాను పుట్టి ఊరు మాత్రమే రాయలసీమ అని, తన మెట్టినిల్లు తెలంగాణ అని దాదాపు రెండేళ్ల ఇక్కడ రాజకీయం చేశారు షర్మిల. తన పిల్లలు కూడా ఇక్కడే పుట్టారని, తాను చనిపోయినా ఇక్కడే అని సెంటిమెంటు డైలాగులు చెప్పారు. ఇక, పాలేరులో ఇల్లు కట్టుకున్నారు. అక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రచారం చేశారు. కానీ తెలంగాణ సమాజం షర్మిలను తెలంగాణ కోడలిగా చూడలేదు. ఆంధ్రా బిడ్డగానే చూసింది. దీంతో ఆమె స్థాపించిన పార్టీకి ఆదరణ దక్కలేదు. పాదయాత్ర చేసినా. బస్సుయాత్ర చేసినా. జైలుకు వెళ్లినా.. ఆమెకు ఆశించిన రెస్పాన్స్‌ రాలేదు. కనీసం ఆ పార్టీ నుంచి షర్మిల కూడా గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో తెలంగాణలో పార్టీని మూసివేయాలని నిర్ణయించారు.

కాంగ్రెస్‌లో విలీనం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్సార్‌ టీపీ మద్దతు ఇస్తుందని ప్రకటించిన షర్మిల ఎన్నికల తర్వాత తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్‌లో విలీనం చేశారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో హస్తం కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి బిడ్డగా మెకు పార్టీలో సముచిత స్థానం ఇచ్చింది. ఏకంగా ఏపీపీసీసీ పగ్గాలే అప్పగించింది. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ఆమె.. ఇక అధికార వైసీపీ, విపక్ష టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలంగాణలో ఉన్నప్పుడు అధికార బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులతోపాటు సీఎం కేసీఆర్‌ను కూడా టార్గెట్‌ చేసి వ్యక్తిగత దూషణలు చేశారు. ఇక ఆంధ్రాలో కూడా ఇప్పుడు అదే పంథా అవలంబిస్తున్నారు. తన సొంత అన్న అయిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డిని ఏకవాక్యంతో జగన్‌రెడ్డి అంటూ సంబోదిస్తున్నారు.

శ్రీరెడ్డికి బుక్కయిందిలా..
ఇక షర్మిల సంచలన నటి, వైఎస్సార్‌సీపీ అభిమాని శ్రీరెడ్డికి బుక్కయింది. తెలంగాణను విడిచి ఏపీకి వెళ్లిన షర్మిలను శ్రీరెడ్డి ఓ ఆటాడుకుంది. షర్మిల వాయిస్‌ను ఇమిటేట్‌ చేస్తూ.. చెప్పలేని భాషలో ఓ వీడియో చేసి.. దానిని షోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. తెలంగాణను విడిచి వచ్చానని, ఇక ఆంద్రా ప్రజలను ముంచుతానని, డబ్బులు పోగొట్టుకుంటానని, తన కొడుకుకు పుట్టబోయే బిడ్డకు ఆంధ్రాను రాసిస్తానంటూ పచ్చిగా విమర్శలు చేశారు. వీడియో మొత్తం షర్మిల వాయిస్‌ను ఇమిటేట్‌ చేశారు. సుమారు నిమిషం పాటు ఉన్న ఈ వీడియోను ఇప్పటికే 8 వేల మందికిపైగా వీక్షించారు.

కామెంట్ల వెల్లువ..
ఇక శ్రీరెడ్డి చేసిన ఈ వీడియోను ఇప్పటికే 8 వేల మందికిపైగా చూశారు. దీనిని చూసిన వారంతా ఎవరికి నచ్చిన కామెంట్లు వారు పెడుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ అభిమానులు శ్రీరెడ్డిని విమర్శిస్తున్నారు. దుర్భాషలాడుతున్నారు. ఇక వైసీపీ అభిమానులు షర్మిలను మెంచుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తంగా షర్మిల తన వీడియోతో ఏపీ రాజకీయాల్లో ఓ సంచలనం క్రియెట్‌ చేశారు.