YCP Leaders: జడ్జిలకు గిఫ్ట్ ఆఫర్లా.. వైసీపీ నేతలు అంత ధైర్యం చేశారా?

అప్పట్లో చేసిన ఈ ఫిర్యాదు పై సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్ర నిఘా సంస్థల సాయంతో విచారణ జరిపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. టీటీడీ అధికారి ధర్మారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Written By: Dharma, Updated On : January 24, 2024 2:45 pm

YCP Final List

Follow us on

YCP Leaders: పాలనా వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం అధికమైందని ఆ మధ్యన కామెంట్స్ వినిపించాయి. ప్రధానంగా ఏపీలో వైసిపి ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆది నుంచి అధినేత జగన్ పై కేసులు ఉండడం, ఆపై అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలను కోర్టులు తప్పు పట్టడంతో ఈ తరహా ఆరోపణలు చేసేవారు. అయితే న్యాయవ్యవస్థకు సైతం అవినీతి మకిలి అంటించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారన్న ఆరోపణలు సైతం వినిపించాయి. ఇటీవల వెలుగు చూస్తున్నాయి. మూడు సంవత్సరాల కిందట ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తికి రెండు కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన వాచ్ ను ఇచ్చేందుకు ప్రయత్నించారని.. కానీ ఆ న్యాయమూర్తి తిరస్కరించడమే కాదు.. సుప్రీంకోర్టుకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

అయితే అప్పట్లో చేసిన ఈ ఫిర్యాదు పై సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్ర నిఘా సంస్థల సాయంతో విచారణ జరిపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. టీటీడీ అధికారి ధర్మారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కీలక న్యాయమూర్తుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు పిలవకపోయినా వీరు వెళ్తారని.. ఇలా వెళ్లే క్రమంలో బహుమతులు ఇచ్చి వస్తుంటారని.. ఆ బహుమతులు కోట్ల రూపాయల విలువైనవని ఒక ప్రచారం జరుగుతోంది. వీరు న్యాయమూర్తులకు ఇచ్చిన బహుమతులు విషయంలో త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత రానుందని టాక్ నడుస్తోంది. అదే జరిగితే రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది.

వాస్తవానికి సీఎం జగన్ పై అనేక అవినీతి కేసులు ఉన్నాయి. తనకు ప్రతికూలంగా కోర్టుల్లో తీర్పులు వస్తే.. మేనేజ్ చేశారని ఆరోపణలు చేసేవారు. అధికారంలోకి వచ్చిన తరువాత సైతం న్యాయ వ్యవస్థను విపక్ష నేతలు మేనేజ్ చేస్తున్నారని సైతం వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విరుద్ధంగా తాను తీసుకున్న నిర్ణయాలను కోర్టులు కొట్టివేస్తే ఉద్దేశాలను ఆపాదించేవారు. చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే సమయంలో ఎన్వి రమణ పైన తప్పుడు ఆరోపణలతో లేఖలు రాశారు.ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే ఛాన్స్ వచ్చినా ఆహ్వానించే స్థితిలో జగన్ లేకుండా పోయారు. అప్పట్లోనే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. అటు జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో చాలామంది వైసిపి నేతలపై కేసులు కూడా నమోదయ్యాయి. ఒకరిద్దరూ జైలు జీవితం సైతం గడపాల్సి వచ్చింది. ఇప్పుడు వైసిపి కీలక నేతలు ఏకంగా జడ్జిలకు విలువైన బహుమతులు అందించారన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతుండడం విశేషం. దీనిపై ఎటువంటి తీర్పు వస్తుందో చూడాలి.