Train Ticket Transfer: భారతదేశంలో కోట్లాది మంది రైలులో ప్రయాణిస్తుంటారు. ఇతర ప్రయాణ మార్గాల కంటే రైలులో ప్రయాణించడం మరింత సౌకర్యవంతంగా, ఆర్థికంగా కూడా బెటర్ గా ఉంటుంది. కాబట్టి చాలా మంది రైలులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. అందుకే ప్రతి సంవత్సరం రైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. దీని కారణంగా, టిక్కెట్ల కోసం చాలా పోటీ ఉంటుంది. దూరంగా ఉండే ప్రయాణం చేయాలంటే నెలల ముందే బుక్ చేసుకోవాలి. అయినా సరే కొన్ని సార్లు బుక్ కావడం కాదు. ముఖ్యంగా పండుగల సీజన్‌లో అయితే మరింత కష్టం. అందుకే ఇలాంటి పరిస్థితిలో, చాలా సార్లు ప్రయాణీకులు ఎవరైనా తమ టికెట్ ఇచ్చి, వారి స్థానంలో ప్రయాణించగలిగితే బాగుండు అనుకుంటారు కదా. మరి ఇలా చేయవచ్చా? లేదా అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందామా?
దూర ప్రయాణాలు చేయాలంటే చాలా సావాసాలు చేయాలి కదా. వామ్మో టికెట్ లేకుండా అంటే రిజర్వేషన్ లేకుండా ప్రయాణించడం అంటే చాలా కష్టం. అసలు చేయలేం కదా. ఆ ప్రయాణం కంటే చేయకుండా ఉండటం బెటర్ అనిపిస్తుంది. రైల్వేలు ప్రయాణించడానికి కొన్ని నియమాలను రూపొందించారు. వాటిలో ఒకటి వేరొకరి టికెట్‌పై ప్రయాణించడం నిషేధం. మీరు వేరే వారి టికెట్ మీద ప్రయాణం చేయలేరు. కానీ ఒక చిన్న పని చేస్తే ఇది సులభం అవుతుంది. వేరొకరి ధృవీకరించిన టికెట్‌పై సులభంగా ప్రయాణించవచ్చు. కానీ అందరూ ఈ టికెట్‌పై ప్రయాణించలేరు. ఇంతకీ ఎలా అంటే?
వేరొకరి టికెట్‌పై ఎవరు ప్రయాణించవచ్చు?
రైల్వే నిబంధనల ప్రకారం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, కొడుకు-కుమార్తె లేదా భర్త-భార్య మాత్రమే వేరొకరి కన్ఫర్మ్ టికెట్‌పై ప్రయాణించగలరు. అంటే మీ కుటుంబ సభ్యులు మాత్రమే మీ టికెట్‌పై ప్రయాణించగలరు. ఈ టికెట్‌పై మరెవరూ ప్రయాణించలేరు.
Also Read: Indian Railways : రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జూలై 1 నుంచి టికెట్ బుక్ చేయలేరు..కారణం ఇదే
కుటుంబ సభ్యులకు టికెట్ ఎలా బదిలీ చేయవచ్చు?
రైలు టికెట్‌ను బదిలీ చేయడానికి, మీరు ధృవీకరించిన టికెట్ కాపీతో రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లాలి. టికెట్‌ను బదిలీ చేస్తున్న వ్యక్తి గుర్తింపు కార్డును టికెట్‌తో జతచేయాలి. దీనితో పాటు, మీరు టికెట్‌ను ఎవరికి బదిలీ చేస్తున్నారో వారికి మీకు ఉన్న సంబంధం ఏమిటో కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. మీరు గుర్తింపు కార్డును కూడా అందించాలి. దీని తర్వాత, ధృవీకరణ తర్వాత, మీ టికెట్ మీ కుటుంబ సభ్యుని పేరుకు బదిలీ చేస్తారు. ఈ ప్రాసెస్ తర్వాత మీరు హ్యాపీగా ప్రయాణం చేయవచ్చు. లేదంటే కష్టం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.