Low Cost Insurance India: ప్రస్తుత కాలంలో మనిషి ఎప్పుడూ ఏ విధంగా ఉంటాడో తెలియని పరిస్థితి. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి గంట తర్వాత మరణించిన ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఆ ఒక్క వ్యక్తి మరణిస్తే ఇలాంటి సమస్య ఉండదు. కానీ అతనిపై ఆధారపడ్డ కుటుంబం తీవ్రంగా ఆవేదన చెందుతుంది. ఎందుకంటే ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోతే కుటుంబం మొత్తం చిన్న భిన్నం అవుతుంది. అయితే ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. దీంతో చాలామంది ఇప్పటికే టర్మ్ ఇన్సూరెన్స్ లేదా ఇతర బీమా పాలసీలు తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వానికి సంబంధించిన ఓ పాలసీ కి కేవలం రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2,00,000 ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. మరి ఈ ఇన్సూరెన్స్ పేరు ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే.
ఇప్పుడున్న కాలంలో ఏ ఇన్సూరెన్స్ తీసుకున్న సంవత్సరానికి ఒక వ్యక్తికి.. కనీసం రూ. 5000 వరకు ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వానికి చెందిన ‘ప్రధానమంత్రి బీమా సురక్ష యోజన’అనే పాలసీ కేవలం రూ.20 మాత్రమే. ఈ 20 రూపాయలు చెల్లిస్తే ఏడాది పాటు రెండు లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇన్సూరెన్స్ లో భాగంగా పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 2 లక్షలను ఆ వ్యక్తి కుటుంబానికి అందిస్తారు. అయితే ఈ ప్రమాదం కేవలం ప్రయాణంలోని కాకుండా.. ఫ్యాక్టరీలు, కంపెనీలో పనిచేసే సమయంలో ఏర్పడిన అగ్ని ప్రమాదాలు లేదా ఇతర ప్రమాదాలు జరిగినా కూడా వర్తిస్తుంది.
Also Read: Insurance Policy: ఇది లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకండి.. లేకుంటే భారీగా నష్టపోతారు..
అంతేకాకుండా ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు పూర్తిగా పనిచేయలేని పక్షంలో ఉంటే.. అనగా ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు చేతులు కాళ్లు కోల్పోయినా.. లేదా చూపు కోల్పోయిన ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అంటే ఆ వ్యక్తి ఆ పొజిషన్లో ఉంటే రూ. రెండు లక్షల వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇవే కాకుండా కొన్ని ప్రమాదాల వల్ల 50 శాతం శరీర భాగాలు నష్టపోతే రూ. లక్ష వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అంటే ఒక కాలు పనిచేయకపోయినా.. ఒక చెయ్యి ఉండి మరొక చెయ్యి ప్రమాదవశాత్తు విరిగిపోయినా ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
అయితే ఒక వ్యక్తి మరణిస్తే అతని పాలసీకి సంబంధించిన మొత్తం అతని నామిని ఖాతాలోకి రూ. రెండు లక్షలు జమ చేస్తారు. ఒకవేళ ప్రమాదవశాత్తు శరీరా అవయవాలు పనిచేయకపోయి.. ఆ వ్యక్తి బతికి ఉంటే అతని ఖాతాల్లోకి ఈ మొత్తాన్ని జమ చేస్తారు. మొత్తంగా రూ. 20 రూపాయలతో రెండు లక్షల ఇన్సూరెన్స్ను పొందే అవకాశం ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ అన్ని బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. ఆయా బ్యాంకుల్లో అకౌంట్ ఉంటే చాలు.. బ్యాంకు అధికారులను సంప్రదించి ఒక ఫామ్ను నింపి ఇస్తే.. వెంటనే ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ప్రతి ఏడాది జూన్ 1 నుంచి ఆ తర్వాత ఏడాది మే 31 వరకు ఈ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత దీనిని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెన్యువల్ కోసం ఆటో డెబిట్ ఏర్పాటు చేసుకొని బ్యాంకులో మనీ ఉంచితే చాలు..