Health Tips: అన్ని మర్చిపోతున్నారా? అయితే జ్ఞాపకశక్తిని పెంచుకోండి ఇలా

జ్ఞాపకశక్తిని మెరుగు పరుచుకోవాలి అంటే పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పోషకాలు మెండుగా ఉండే ఆహారాలు అంటే ముందుగా గుర్తు వచ్చేవి చేపలు.

Written By: Swathi Chilukuri, Updated On : April 2, 2024 2:03 pm

Tips to improve your memory

Follow us on

Health Tips: అరె ఇంతకు ముందే వాచ్ ఎక్కడో పెట్టానే.. జస్ట్ ఇప్పుడే వచ్చి బండి కీ ఇలా పెట్టాను. అప్పుడే ఎక్కడ పెట్టానో దొరకడం లేదు. ఏమైందో ఏమో.. ఈ టెన్షన్ లకు ఏది గుర్తుండి సావడం లేదు అంటూ తిట్టుకుంటూనే గుర్తు రాని వస్తువుల వెనక వేట మొదలు పెడుతాం. ఎంత తల గోక్కున్న, సుత్తి తీసుకొని కొట్టుకున్నా గుర్తు రావు. ఖాళీ సమయం దొరికితే ఏంటో నాకు ఈ మధ్య ఏం గుర్తుండటం లేదంటూ మరింత టెన్షన్.. ఇక ఈ టెన్షన్ అవసరం లేదు. కాస్త మీ ఫుడ్ లో ఛేంజెస్ చేసుకోండి చాలు.

జ్ఞాపకశక్తిని మెరుగు పరుచుకోవాలి అంటే పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పోషకాలు మెండుగా ఉండే ఆహారాలు అంటే ముందుగా గుర్తు వచ్చేవి చేపలు. వీటిలో జ్ఞాపకశక్తిని మెరుగు పరిచే, రక్త ప్రసరణను మెరుగుపరిచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి చేపలా? ఛీ స్మెల్ అనకుండా తినేసేయండి. పాలలో కూడా పోషకాలు మెండుగా ఉంటాయి. పాలన్ బ్రెయిన్ బూస్టింగ్ డ్రింక్ అంటారు. సో రోజు పాలు కూడా తాగండి.

ప్రతిరోజు దానిమ్మ పండును తింటే కూడా మీ మెదడు ఆరోగ్యం పదిలం అవుతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి ఫుల్ గా పెరుగుతుంది. వాల్ నట్స్ వల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాదు మెదడు ఆరోగ్యాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మనం తినే ఆకుకూరలు కూడా మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అందుకే పచ్చని ఆకుకూరలు, కూరగాయలను తీసుకోండి. మెదడుకు పదును పట్టడంలో తోడ్పడతాయి పచ్చటి కూరగాయలు.

మెదడు సామర్థ్యాన్ని పెంచడంలో గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో విటమిన్ బి, కోలిన్, పోషకాలకు ఢోకా లేదు. ఇక బాదం పప్పులు, వేరుశనగ పప్పులు కూడా ప్రతి రోజు తినాలి. ఇందులోని పోషకాలు కూడా జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తాయి. పెద్దలకు, పిల్లలకు ఈ ఆరోగ్య నియమాల వల్ల మెదడు ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి మీ డైట్ ను కాస్త మార్చుకోండి.