Health Tips: ప్రస్తుత సమాజంలో అతి బరువు అనేది ప్రధాన సమస్యగా మారింది. ఊబకాయంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. మారుతున్న జీవన శైలీనే దీనికి కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కూడా కొందరు. అయినా కూడా ఫలితం శూన్యం గా ఉంటుంది. కానీ ఒక్కసారి మీ దినచర్యలో ఇలాంటి మార్పులు చేసుకోండి. ఇంతకీ ఏం చేయాలంటే..
బరువు తగ్గాలి అనుకునేవారు ఉదయం లేవగానే కొన్ని అలవాట్లను అలవర్చుకోవడం వల్ల తొందరగా ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. ఉదయం లేవగానే పళ్ళు తోముకోకుండా ఒక గ్లాసు నీరు తాగాలి. పరిగడుపున నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా బరువు తగ్గడంలో సహాయం అవుతుంది. ప్రతి రోజు ఉదయం లేచిన తర్వాత యోగా చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. యోగా వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది అంటున్నారు నిపుణులు.
ఉదయం నిద్ర లేచిన తర్వాత మార్నింగ్ వాక్ చేయాలి. దీనివల్ల శరీరంలో ఉన్న కేలరీలు ఖర్చు అవుతాయి. దీనివల్ల సంతోషకర హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల బరువు తగ్గడం, ఆరోగ్యంగా ఉండడం రెండూ మీ సొంతమే. ప్రతి రోజు ఉదయం లేవగానే వ్యాయామం కూడా కచ్చితంగా చేయాలి. దీంతో ఊబకాయ సమస్య నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఉదయం పూట ఆరోగ్యకరమైన ఆహారాన్ని అల్పాహారంగా తీసుకోవాలి.
నూనెలో ముంచి తీసిన ఆహారాలను తినకుండా ఉండడమే బెటర్. పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మీ బరువు నియంత్రణలో ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే మీ బరువును నియంత్రించడం మీ చేతిలోనే ఉంటుంది అంటారు నిపుణులు. మరి తెలుసుకున్నారు కదా.. ఇకనుంచి అయినా ఉదయం లేవగానే ఒక గ్లాసు వాటర్ తాగి, యోగా, వ్యాయామం, మార్నింగ్ వాక్ వంటివి అలవాటు చేసుకోండి.