https://oktelugu.com/

Mrunal Thakur: విజయ్ ను అలా తిట్టారు.. దానికి అర్థం తెలుసా? అంటే మృణాల్ సమాధానమిదీ

ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ లో విజయ్ దేవరకొండను మృణాల్ ఠాకూర్ మెంట్ నా కొడకా అంటూ తిడుతుంటుంది. దీనిపైననే ఒకరు ప్రశ్న అడిగారు. పాపం ఏంటి విజయ్ ను అలా తిట్టారు?

Written By:
  • Neelambaram
  • , Updated On : April 2, 2024 / 02:16 PM IST

    Mrunal Thakur Superb Reply To Reporter

    Follow us on

    Mrunal Thakur: విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ స్టార్ హీరో మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఈ నెల 5న రిలీజ్ కావడానికి సిద్ధమైంది. ఇప్పటికే ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఇక తాజాగా ప్రెస్ మీట్ లో జర్నలిస్టులు అడిగిన చాలా ప్రశ్నలకు క్రేజీ క్రేజీ ఆన్సర్లు ఇచ్చారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా మృణాల్ ఇచ్చిన సమాధానం తెగ వైరల్ గా మారింది.

    ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ లో విజయ్ దేవరకొండను మృణాల్ ఠాకూర్ మెంట్ నా కొడకా అంటూ తిడుతుంటుంది. దీనిపైననే ఒకరు ప్రశ్న అడిగారు. పాపం ఏంటి విజయ్ ను అలా తిట్టారు? ఇంతకీ మీకు దానికి అర్థం తెలుసా? ఎందుకు అలా తిట్టాల్సి వచ్చింది అంటూ అడిగితే భలే ఫన్నీగా సమాధానం చెప్పింది మృణాల్ ఠాకూర్. అయ్యో అలా అడగకండి. నిజంగానే మెంటల్ నాకొడకా. కానీ చాలా లవబుల్ అంటూ సమాధానం చెప్పింది. అంతేకాదు ఏవండి అని ప్రేమగా పిలిచింది.

    కోపంలో పిలిచేది వేరుగా ఉంటుందని.. రిలేషన్ లో చాలా స్టేజ్ లు ఉంటాయని.. క్యూట్, హనీమూన్, గర్ల్ ఫ్రెండ్, లవర్, భాయ్ ఫ్రెండ్, తర్వాత భర్త, ఆ తర్వాత చివరకు మెంటల్ నా కొడకా కూడా ఉంటుంది అని ఫన్నీగా సమాధానం చెప్పింది. ఆ పదానికి తనకు అర్థం తెలుసు అని.. అంటే పాగల్ కా సన్ అని చెప్పేసరికి అందరూ నవ్వారు. ఇంత క్యూట్ గా మృణాల్ ఆన్సర్ ఇచ్చేసరికి అందరూ నవ్వుకున్నారు. ఆహా మృణాల్ తిట్టినా ఇంత క్యూట్ గా ఉంటుందా అంటూ ఆమె ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు.

    ఇదిలా ఉంటే సినిమా ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా గీత గోవిందం సినిమా తెరకెక్కించిన పరుశురాం ఈ సినిమాకు కూడా డైరెక్టర్ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. మరోసారి విజయ్ కు బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు ఫ్యాన్స్. విజయ్ జోడీగా మృణాల్ కూడా అదిరిపోయిందని టాక్ వస్తుంది. మరి చూడాలి ఇద్దరికి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను ఇవ్వబోతుందో..