Wallet : నేటి కాలంలో ఎవరికైనా డబ్బు సంపాదించాలన్న కోరిక కచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో పురుషుడు డబ్బు సంపాదించడం వల్ల కుటుంబం హాయిగా ఉంటుంది. అయితే పురుషుడు డబ్బు సంపాదిస్తే స్రీ ఆ డబ్బును కాపాడే విధంగా ప్రయత్నించాలి. అంటే అనవసరపు ఖర్చులకు పోకుండా అవసరమైన విధంగా ఖర్చులు చేస్తూ ఇంటి బాగోవులు చూసుకుంటూ ఉండాలి. పురుషులు కూడా వ్యసనాల బారిన పాడి దుబార ఖర్చులు చేయకుండా డబ్బును పొదుపు చేస్తూ ఉండాలి. అయితే ఒక్కోసారి ఎంత పొదుపు చేసినా.. ఖర్చులు తగ్గించిన పర్సు ఖాళీగానే కనిపిస్తుంది. ఇలా పర్సు ఖాళీగా కనిపించకుండా ఉండాలంటే కొన్ని పరిహారాలు చేయాలి. ఈ పరిహారాన్ని ఇంట్లో ఉండే స్రీ మాత్రమే చేయాలి. ఇలా చేయడం వల్ల తమ భర్త పర్సు ఎప్పుడు నిండుగా ఉంటుంది. అసలు పర్సు డబ్బులతో నిండుగా ఉండాలంటే స్రీ ఏం చేయాలి? పురుషులు ఎటువంటి పొరపాట్లు చేయకూడదు?
Also Read : వ్యాలెట్‌లో ఇవి పెట్టుకుంటే.. డబ్బే డబ్బే!
చాలామందికి పర్సు జేబులో ఉంచుకోవడం అలవాటు. అయితే ఈ పర్సులో ఎప్పుడూ డబ్బులు ఉండడం కష్టమే. ఎందుకంటే నేటి కాలంలో బ్యాంకులో డబ్బులు నిల్వ ఉంచుకొని కార్డులు మాత్రమే అందుబాటులో ఉంచుకుంటున్నారు. అయితే ఒక్కోసారి సాంకేతిక కారణాలవల్ల ఈ కార్డులు పనిచేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో చేబులో ఉన్న పర్సులో డబ్బు ఉండడం తప్పనిసరిగా మారుతుంది. కానీ కొందరు ఎప్పుడూ పర్సనల్ ఖాళీగా ఉంచాలని చూస్తారు. డబ్బులు ఉన్నా కూడా తమ దగ్గర డబ్బులు లేవని కాళీ పర్సన్ చూపిస్తారు.
ఎదుటివారు డబ్బులు అడిగినప్పుడు తమ దగ్గర ఇంత ఉన్నాయని చెప్పడం ధర్మం. అలాకాకుండా నా దగ్గర డబ్బులు లేవని ఖాళీ పర్సను చూపించడం వల్ల అశుభమే ఎదురవుతుంది. ఎందుకంటే ఖాళీ పర్సు ఉండడం వల్ల లక్ష్మీదేవి కూడా సంతోషించదు. పర్సులో ఎంతోకొంత డబ్బును కచ్చితంగా ఉంచుకోవాలని తెలుపుతున్నారు.
ఇక కొందరు అప్పులకు సంబంధించిన పత్రాలను పర్సులో ఉంచుకుంటారు. ఇలా పర్సులో ఉంచుకోవడం వల్ల డబ్బు ఎప్పుడూ బయటకు పోవాలని చూస్తుంది. అందువల్ల ఇలాంటి పత్రాలను పర్సులో అస్సలు ఉంచుకోకూడదు. అలాగే ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉంటున్న పత్రాలను కూడా పర్సులో ఉంచుకోకుండా ఉండాలి.
ఇక స్రీలు తమ భర్త పర్సు ఎప్పుడు డబ్బులతో ఉండాలంటే ఇంట్లో ఒక పరిహారం చేయాల్సి ఉంటుంది. మంగళవారం లేదా శుక్రవారం రోజున యాలకులతో లక్ష్మీదేవికి పూజించి వాటిలో ఒకదానిని తమ భర్సుకు ఇచ్చి పర్సులో ఉంచుకోమని చెప్పండి. ఇలా చేయడం ద్వారా పర్సులో ఎప్పుడూ డబ్బులు నిల్వలతో ఉంటాయి. లక్ష్మీదేవికి యాలకుల పూజ ఎంతో ఇష్టం. అలాగే శుక్రవారం లేదా మంగళవారం ఇలా చేయడం వల్ల మరింత సంతోషించి స్రీ కోరికను నెరవేరుస్తుంది. అందువల్ల ఇలాంటి పరిహారం చేసి పర్సులో ఎప్పుడూ డబ్బులు ఉండేలా చూసుకోవాలని కొందరు పండితులు తెలుపుతున్నారు. అయితే పర్సులో డబ్బులు ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఖర్చులు చేయమని కాదు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలని అప్పుడే డబ్బు రెట్టింపుగా మారుతుందని అంటున్నారు.
Also Read : ఇంట్లో ఉండే ఈ వస్తువులు పర్సులో పెడితే డబ్బే డబ్బు..