https://oktelugu.com/

Wallet: వ్యాలెట్‌లో ఇవి పెట్టుకుంటే.. డబ్బే డబ్బే!

చాలా మందికి తెలియక పర్సులో కొన్ని వస్తువులను పెడుతుంటారు. వీటివల్ల ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. అయితే కొన్ని వస్తువులను పర్సులో పెట్టడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటారు. మీ పర్సు ఎప్పటికీ డబ్బుతో నిండిపోతుంది. ఇంతకీ పర్సులో పెట్టాల్సిన వస్తువులు ఏవి? పెట్టకూడని వస్తువులు ఏవో మరి తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 7, 2024 / 04:27 AM IST

    Wallet Vastu

    Follow us on

    Wallet: డబ్బు అనేది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ముఖ్యమే. ఈ రోజుల్లో అయితే డబ్బు లేకపోతే అసలు పని కాదు. డబ్బుతో పాటు దేవుడు, వాస్తు వంటివి వాటిని కూడా చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే వాస్తు సరిగ్గా ఉంటేనే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని లేకపోతే ఉండదని నమ్ముతారు. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా కుటుంబం సంతోషంగా ఉండాలంటే తప్పకుండా కూడా అన్ని నియమాలు పాటించాలని భావిస్తారు. అయితే కొందరికి తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల కటిక పేదరికాన్ని అనుభవిస్తారు. చాలా మందికి తెలియక పర్సులో కొన్ని వస్తువులను పెడుతుంటారు. వీటివల్ల ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. అయితే కొన్ని వస్తువులను పర్సులో పెట్టడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటారు. మీ పర్సు ఎప్పటికీ డబ్బుతో నిండిపోతుంది. ఇంతకీ పర్సులో పెట్టాల్సిన వస్తువులు ఏవి? పెట్టకూడని వస్తువులు ఏవో మరి తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.

    కొందరు పర్సును సరిగ్గా ఉపయోగించరు. ఎక్కడ లేని చెత్త అంతా కూడా ఇందులోనే పెడతారు. అయితే పర్సులో లక్ష్మీ దేవి ఫొటోను పెట్టాలని పండితులు అంటున్నారు. దీన్ని పెట్టడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు. అప్పుల బాధలు అన్ని తొలగిపోతాయి. మీ పర్సు ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా డబ్బులతో నిండి ఉంటుంది. అలాగే పర్సులో కుబేర యంత్రాన్ని కూడా పెట్టాలి. కుబేర యంత్రాన్ని ఓ చిన్న పసుపు గుడ్డలో చుట్టి పర్సులో పెట్టడం వల్ల ఆర్ధిక సమస్యలు అన్ని తొలగిపోతాయి. ఒక్క రూపాయి లేకుండా ఉండే పరిస్థితికి ఎప్పటికీ రారు. ప్రతీ అవసరానికి మీ చేతుల్లో డబ్బు అందుతుంది. డబ్బులు లేకుండా అసలు ఉండరు. అలాగే పర్సులో వెండి నాణెం కూడా పెడితే డబ్బు ఉంటుంది. ఈ వెండి నాణెం లక్ష్మీ దేవి పాదాల దగ్గర ఉంచి.. పర్సులో పెట్టుకోవాలని పండితులు అంటున్నారు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయని పండితులు అంటున్నారు. అలాగే శ్రీ యంత్రాన్ని కూడా పర్సులో పెడితే.. సంపద, పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందని పండితులు అంటున్నారు.

    ఇలాంటి నియమాలు పాటిస్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. ఇంట్లో ఎప్పుడు డబ్బు ఉంటూనే ఉంటుంది. అసలు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. అదే పర్సులో చిరిగిన నోట్లు, చిందర వందరగా పర్సును ఉంచితే అసలు పర్సులో డబ్బులు ఉండవు. దీనివల్ల ఆర్థికంగా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడతారు. కాబట్టి పర్సును లక్ష్మీ దేవిలాగా చూసుకోండి. దీనివల్ల ఎప్పటికీ డబ్బు ఉంటుంది. తెలుసో తెలియక ఈ చిన్న తప్పులు అసలు చేయవద్దని పండితులు చెబుతున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.