Homeలైఫ్ స్టైల్Hypnic Jerk Causes and Remedies: నిద్రలో ఉలిక్కి పడే వారికి అలర్ట్.. వైద్యులు ఏం...

Hypnic Jerk Causes and Remedies: నిద్రలో ఉలిక్కి పడే వారికి అలర్ట్.. వైద్యులు ఏం చెప్తున్నారంటే?

Hypnic Jerk Causes and Remedies: మనిషి ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే అవసరం. రోజంతా రకరకాల పనుల వల్ల అలసిపోయిన వారు రాత్రి నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. అయితే ఇదే సమయంలో కొన్ని అనుభవాలను ఎదుర్కొంటారు. మెల్లగా నిద్రిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్లు అనిపిస్తుంది. అయితే ఇలా ఉలిక్కిపడడం వల్ల ఏదైనా జబ్బు కావచ్చు అని చాలామందికి సందేహం ఉంటుంది. కొంతమంది వైద్యులు తెలుపుతున్న ప్రకారం ఇది జబ్బు కాదని దీనిని హిప్నిక్ జర్క్ అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది లో ఇది కనిపిస్తుంది. అయితే ఇది ఎలా ఏర్పడుతుంది? దీని గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..

ప్రస్తుత కాలంలో చాలామంది చేసే పనులు రకరకాల ఒత్తిడితో కలిగి ఉంటున్నాయి. దీంతో ఈ ఒత్తిడి మెదడుపై ప్రభావం పడుతుంది. ఇలా రోజంతా అలసిపోయిన వారు రాత్రి సమయంలో నిద్రపోతున్నప్పుడు శరీర కండరాలు నెమ్మదిగా రిలాక్స్ అవుతాయి. ఆ తర్వాత నిద్ర ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో మెదడు శరీరం అకస్మాత్తుగా రిలాక్స్ కావడాన్ని గ్రహించి పడిపోతున్నాం అనే భావనతో కలిగి ఉంటుంది. దీంతో కింద పడిపోవద్దు అనే ఉద్దేశంతో అలర్ట్ చేస్తూ మెదడు ఒక సంకేతాన్ని పంపుతుంది. దీనికి ప్రతిస్పందనగా కండరాలు ఒక్కసారిగా సంకోచం చెందుతాయి. దీనివల్ల చేతులు లేదా కాళ్లు వణిగినట్లు అవుతాయి. అయితే ఇది మెదడు పంపే తప్పుడు సంకేతం అని అంటున్నారు. ఒక రకంగా శరీరం కింద పడిపోతుంది అని చెబుతూ కాపాడుకోండి అని చెప్పే సంకేతం అని అనుకోవచ్చు.

ఇలాంటి పరిస్థితి వయసుతో సంబంధం లేకుండా అందరిలో కలుగుతుంది. అయితే ఇది రావడానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు. పెద్దవారిలో ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి కెఫెన్ ఎక్కువగా తీసుకోవడం.. మానసిక ఒత్తిడిని కలిగి ఉండడం వంటివి ఉంటాయి. అలాగే చిన్న పిల్లలు ఇతర వ్యక్తుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే రాత్రివేళ ఎక్కువగా మొబైల్ చూడడం.. నిద్రలేమి.. సమయపాలన లేకుండా నిద్రపోవడం.. శారీరకంగా అలసిపోవడం వంటివి ఉండటం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుంది.

అయితే ఇది ప్రమాదకరమా..? అని కొందరికి సందేహం కలుగుతుంది. వాస్తవానికి ఇలాంటి పరిస్థితి వల్ల ఎటువంటి ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ మానసికంగా మాత్రం ఆందోళనలతో ఉంటారు. అయితే ఇవి రాకుండా ఉండాలంటే ధ్యానం చేస్తూ ఉండాలి. రిలాక్స్ వాతావరణం లో గడుపుతూ ఉండాలి. రోజంతా అలసట ఉంటే కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఉండాలి. తేలికపాటి వ్యాయామం చేయాలి. ప్రతిరోజు సరైన నిద్ర పోయే ప్రయత్నం చేయాలి. నిద్రపోయేటప్పుడు గంట ముందు స్క్రీన్ టైమ్ కు దూరంగా ఉండాలి.

ఉలికి పడడం వంటివి కొందరిలో సాధారణమే అయినా మరికొందరిలో ఇది కండరాల నొప్పి కి దారి తీసే అవకాశం ఉంది. అలాగే తీవ్రమైన నిద్రలేమి ఉన్నవారు ఇది ఎదుర్కొంటారు. ఇలా పగలు కూడా అకస్మాత్తుగా ఉలిక్కిపడడం లేదా కండరాలు నొప్పి వంటివి ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version