Wallet Vastu: ఈ రోజుల్లో మనిషి జీవితాన్ని డబ్బే నడిపిస్తుంది. నీరు తాగుదామన్న డబ్బు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో డబ్బు సంపాదించడానికి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు పొద్దంతా కష్టపడినా ఖర్చులకు సరిపోయేంత డబ్బు రావడం లేదు. మరికొందరికి ఎక్కువ ఆదాయం వచ్చినా చేతిలో నిలవకుండా ఖర్చులకే వెళ్తున్నాయి. ఇలాంటి సమయంలో చాలా మంది ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం పొందే అవకాశం ఉందని కొందరు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా చేతిలో ఉండే పర్సులో కొన్ని పదార్థాలను ఉంచుకోవడం వల్ల వద్దన్నా డబ్బు వస్తుందని అంటున్నారు. ఇంతకీ పర్సులో ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలంటే?
మగవాళ్లు, ఆడవాళ్లు పర్సులు వాడడం సర్వ సాధారణం. కొందరికి పర్సు వాడడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ కొందరు పురుషులు ప్యాంట్ లో పర్సు లేనిదే కాలు బయటపెట్టరు. పర్సులో వివిధ కార్డులు, ముఖ్యమైన పేపర్స్ తో పాటు నగదును ఉంచుకుంటారు. అవసరాలకు సరిపోయేంత డబ్బును పర్సులో ఉంచి బయటకు అడుగుపెడుతారు. పర్సులో నగదును ఉంచడం వల్ల ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అంతేకాకుండా వర్షంలో పాడవకుండా ఉంటుంది.
కొందరి జీవితాల్లో ఉండే జాతక దోషాల కారణంగా వారు ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. మరికొందరికి ఆదాయం వచ్చినట్లే వచ్చి మాయం అవుతుంది. ఇలాంటి వారు పర్సులో డబ్బు, పేపర్స్, కార్డులతో పాటు మరికొన్ని వస్తువులు ఉంచుకోవాలంటున్నారు కొందరు జ్యోతిష్యపండితులు. అవేంటంటే.. ముందుగా అరచేతిలో ఇమిడే ఒక శుభ్రమైన గుడ్డను తీసుకోవాలి. ఇది పచ్చని రంగులోని పట్టు వస్త్రం అయితే మరీ మంచిది. ఇందులో 5 యాలకులు, కొంత సోంపు, కాసింత పచ్చకర్పూరం వేసి ఎర్రటి దారంతో ముడివేయాలి.
ఇందులో నుంచి ఆ వస్తువులు బయటపడకుండా గట్టిగా ఎర్రటి దారంతో కట్టివేయాలి. ఇలా కట్టిన దాన్ని బుధవారం లేదా.. లక్ష్మీకి అనుకూలమైన రోజులో పర్సులో భద్రపరుచుకోవాలి. దీనిని జాగ్రత్తగా ఉంచుకోవడం వల్ల వద్దన్నా డబ్బు వస్తుంది. ఒక అయస్కాంతానికి ఇనుము ఏ విధంగా ఆకర్షితులవుతుందో.. ఈ వస్తువులు ఉన్న పర్సుకు డబ్బు అలా ఆకర్షిస్తుందని పండితులు చెబుతున్నారు. డబ్బు కావాలనుకునేవారు ఇలా చేసి ప్రయత్నించి చూడండి..