Children: పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించడం ముందుగా తల్లిదండ్రుల బాధ్యత. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత పని ఉన్నా కూడా ముందుగా పిల్లల భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి. లేదంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వారికి మంచి అలవాట్లు నేర్పించకపోతే తర్వాత తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుంది. అయితే వారి జీవితంలో మంచి బాటలో నడవాలి అంటే పిల్లలకు కొన్ని మంచి అలవాట్లు మాత్రం పక్కా నేర్పించాలి. ఇవి వారి జీవితాన్ని ప్రభావితం చేయడమే కాదు మంచి బాటలో నడిచేలా చేస్తూనే ఆరోగ్యాన్ని పెంపొందించేలా పనిచేస్తాయి. అందులో ముఖ్యమైనవి ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా పిల్లలు రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. నిద్ర పిల్లలకు చాలా అవసరం. ఎందుకంటే నిద్ర వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీదలను చూసి హేళన చేయవద్దు అని చెప్పాలి. వారికి రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పాలి. భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవడం అలవర్చుకోవాలి. భోజనం చేసే ముందు గిన్నెలను తీసుకురావడానికి అమ్మకు సహాయం చేయమని చెప్పాలి.
మంచి అలవాట్లకు మించిన ధనం లేదు అంటారు పెద్దలు. మంచిని మించిన గుణం కూడా లేదు. మనిషికి మాటే అలంకారం కాబట్టి వీరు మాట్లాడే ప్రతి మాట కూడా రెస్పెక్ట్ గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని నేర్పించాలి. మాటనే వెండి, మౌనం, బంగారం కాబట్టి జాగ్రత్త వహించాలని నేర్పించండి. నీళ్లు పట్టుకోవడం అయితే వెంటనే పంపు కట్టేయడం వంటి చిన్న చిన్న పనులు కూడా నేర్పించాలి.
నీళ్ళు వృధా చేయవద్దని చెప్పాలి. నీటి అవసరం తెలపాలి. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. సో అందరితో బాగుండమని చెప్పాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రావని నేర్పించండి. పుస్తకాలను చక్కగా సర్దుకోవాలి. చదువుకుంటేనే జీవితం బాగుంటుంది. పెద్ద వాళ్లు వచ్చినప్పుడు లేచి నిలబడాలి. పెద్ద మాటల వినాలి అని చెప్పండి.