Lakshmi Devi: లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే చాలా నిష్టగా ఉండాలి. సుచి శుభ్రత ఉన్న వద్ద మాత్రమే ఆ తల్లి ఉంటుందని అంటారు పండితులు. కొందరు ప్రతి రోజు కూడా పూజలు చేస్తుంటారు. కానీ కొందరు అసలే చేయరు. దేవుడిని నమ్మని వారు కొందరు అయితే నమ్మేవారు కొందరు. ఏది ఏమైనా ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఒక్కసారి కింద వివరాలు తెలుసుకోండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
బట్టలు మురికిగా ఉండే వారి వద్ద లక్ష్మీదేవి ఉండదట. అందుకే ఎప్పుడు బట్టలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఉతికిన బట్టలు ధరించాలి. ఇంట్లో కూడా దుప్పట్లు ఉతికినవే ఉంచాలి. ఇలా చేస్తేనే మీ ఇంట్లో లక్ష్మీ దేవి ఉంటుంది. దంత లోక సిస్టం. అంటే పాచి మొహంతో ఇంట్లో తిరిగితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదట. అందుకే దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
భక్వాసనం.. భక్వాసనం అంటే అతిగా తినే వారి వద్ద కూడా లక్మీదేవి ఉండదు. అతిగా ఎప్పుడు తినకూడదట. ఇలా తినడం వల్ల లక్ష్మీ దేవి ఉండదు. కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తింటే సమస్య ఉండదట కానీ ఒకేసారి ఎక్కువ తినకూడదట. ఇక మరొక రకం బూతులు. ఉదయం లేవగానే బూతులు మాట్లాడుతుంటారు కొందరు. ఇలాంటి వారి ఇంట్లో కూడా లక్ష్మీ దేవి ఉండదట.
ఉదయం,సంధ్యా సమయంలో నిద్ర పోయే వారి వద్ద కూడా లక్ష్మీ దేవి ఉండదట. ఇలా నిద్ర పోతే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. మరి తెలుసుకున్నారు కదా ఇలాంటి అలవాట్లు మీకు ఉంటే వెంటనే మార్చుకోండి. మీ ఇంట్లో లక్ష్మీ దేవి ఉందంటే ఇల్లంతా కల కల లాడుతుంది.