https://oktelugu.com/

Viral Pics: సీతారాములుగా రన్బీర్ కపూర్, సాయి పల్లవి లుక్స్ ఇవే… ఎవరు బెస్ట్? విమర్శలకు చెక్ పెడతారా?

ఈ జెనరేషన్ స్టార్స్ లో ప్రభాస్ రాముడిగా నటించి మెప్పించారు. గత ఏడాది విడుదలైన ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాఘవుడిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు. కాగా రామాయణం టైటిల్ తో మరో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 29, 2024 / 12:10 PM IST

    Ranbir Kapoor Sai Pallavi first look from Ramayana leaked

    Follow us on

    Viral Pics: భారతీయ ఇతిహాసాల్లో రామాయణం ఒకటి. అద్భుతమైన సినిమాటిక్ సబ్జెక్ట్ కూడాను. హిందువుల ఆరాధ్య దైవం రాముని గాథ రామాయణం స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరు ఆచరించాల్సిన ధర్మ మార్గం. రామాయణం ఆధారంగా వందల చిత్రాలు తెరకెక్కాయి. జనరేషన్స్ మారినా, నాగరికత పెరిగినా… రామాయణం మీద సినిమాలు వస్తూనే ఉన్నాయి. రాముడు పాత్రకు ఎన్టీఆర్ ఐకానిక్ గా ఉన్నారు. ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ పసిప్రాయంలోనే రాముడిగా నటించారు.

    ఈ జెనరేషన్ స్టార్స్ లో ప్రభాస్ రాముడిగా నటించి మెప్పించారు. గత ఏడాది విడుదలైన ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాఘవుడిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు. కాగా రామాయణం టైటిల్ తో మరో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది. ఈసారి శ్రీరాముడి పాత్రను చేసే అదృష్టం రన్బీర్ కపూర్ కి దక్కింది. అనూహ్యంగా ఎందరో బాలీవుడ్ భామలను కాదని సీత పాత్ర సాయి పల్లవిని వరించింది. సహజ నటిగా పేరుగాంచిన సాయి పల్లవి బాలీవుడ్ రామాయణంలో సీతగా నటిస్తుంది.

    ఈ చిత్రం దాదాపు మూడు భాగాలుగా తెరకెక్కనుందని సమాచారం. నితేష్ కుమార్ దర్శకుడు. మరొక విశేషం ఏమిటంటే కెజిఎఫ్ స్టార్ యష్ సైతం రామాయణం చిత్రంలో నటిస్తున్నారు. ఆయన పాత్ర ఏమిటనేది రివీల్ చేయలేదు. యష్ ఈ చిత్ర నిర్మాణ భాగస్వామి కూడాను. కాగా రామాయణం ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో అనధికారికంగా రన్బీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్ అయ్యాయి. రామాయణం సెట్స్ నుండి శ్రీరాముడు, సీత లుక్స్ బయటకు వచ్చాయి.

    అంతఃపురంలో రాముడు-సీత ఏకాంతంగా మాట్లాడుకుంటున్న సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. సీత, రాముడు గెటప్స్ లో సాయి పల్లవి, రన్బీర్ కపూర్ ఉన్నారు. వీరి ఫోటోలు తీసి ఎవరో నెట్లో పెట్టారు. అవి కాస్తా వైరల్ గా మారాయి. ఐకానిక్ రోల్స్ లో రన్బీర్ కపూర్, సీత అద్భుతంగా ఉన్నారు. ముఖ్యంగా సీతగా సాయి పల్లవి బెస్ట్ ఛాయిస్ అని చెప్పాలి. గొప్ప పాత్ర దక్కించుకున్న సాయి పల్లవి సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. రామాయణం చిత్రానికి సాయి పల్లవి పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం..